PM Narendra Modi: ప్రధానికి వ్యతిరేకంగా అభ్యంతరకర పోస్టర్లు.. 8 మంది అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Narendra Modi: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), బీజేపీకి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పోస్టర్ ప్రచారాన్ని ప్రారంభించింది. గుజరాత్ అహ్మదాబాద్ లోని పలు ప్రాంతాల్లో ‘‘మోదీ హఠావో-దేశ్ బచావో’’ వ్యాఖ్యలతో పోస్టర్లను అంటించారు ఆప్ కార్యకర్తలు. దేశవ్యాప్తంగా పోస్టర్ల ప్రచారాన్ని ప్రారంభించిన రోజు తర్వాత ఈ అరెస్టులు జరిగాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రధాని మోదీపై అభ్యంతరకర పోస్టర్లు అంటించినట్లు పోలీసులు వెల్లడించారు. అరెస్ట్ అయిన వారు తమ పార్టీ కార్యకర్తలే అని గుజరాత్ ఆప్ చీఫ్ ఇసుదన్ గాధ్వీ అన్నారు. బీజేపీ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్నామని, అందుకే మా కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు.
Read Also: Amit Shah: హౌరాలో రామనవమి రోజు హింస.. బెంగాల్ గవర్నర్‌ని నివేదిక కోరిన అమిత్ షా..
Also Read
- UP Elections: రంగంలోకి RSS.. BJPతో కలిసి యూపీలో వ్యూహాత్మక కసరత్తు
- Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
- XI Jinping: జిన్‌పింగ్‌కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్‌కు.?
- UAPA: షహజాద్ భట్టి నెట్‌వర్క్‌పై భారత్ ఉక్కుపాదం.. ఉగ్రసంస్థగా ప్రకటన..
‘‘బీజేపీ నియంతృత్వాన్ని చూడండి.. మోదీ హటావో దేశ్ బచావో అనే పోస్టర్లకు సంబంధించి గుజరాత్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలను ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద జైలుకు పంపారు! ఇది మోదీకి, బీజేపీకి భయం కాకపోతే ఇంకేంటి? ఇలా ప్రయత్నించండి. మీకు కావలసినంత కష్టపడండి! ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు పోరాడతారు’’ అంటూ ట్వీట్ చేశాడు గధ్వీ. ఆప్ మోదీకి వ్యతిరేకంగా ‘‘మోదీ హఠావో-దేశ్ బచావో’’ ప్రచారాన్ని దేశవ్యాప్తంగా 11 భాషల్లో ప్రారంభించింది. ఇంగ్లీషు, హిందీ, ఉర్దూతో పాటు గుజరాతీ, పంజాబీ, తెలుగు, బెంగాలీ, ఒరియా, కన్నడ, మలయాళం, మరాఠీ భాషల్లోనూ పోస్టర్లు విడుదల చేసింది. అంతకు ముందు దేశరాజధాని ఢిల్లీలో ఇలాగే ప్రధానికి వ్యతిరేకంగా ఆప్ పోస్టర్లను అంటించింది. ఈ కేసులో ఇప్పటి వరకు 49 ఎఫ్ఐఆర్ లు నమోదు అయ్యాయి. ఆరుగురిని అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
UP Elections: రంగంలోకి RSS.. BJPతో కలిసి యూపీలో వ్యూహాత్మక కసరత్తు
-
Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
-
YS Jagan: ‘రెడ్ బుక్ గవర్నెన్స్’ గ్లోబల్ అయ్యింది.. ఏపీ పోలీసులు, ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఫైర్
-
TGSRTC : బస్టాండ్ ఇక కేవలం బస్టాండ్ మాత్రమే కాదు.. మాల్‌ను తలపించేలా కొత్త లుక్
-
Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!