GT vs MI IPL 2025 Eliminator: ఉత్కంఠభరితంగా సాగిన ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది.. గుజరాత్‌పై గెలుపుతో క్వాలిఫయర్-2కి ముంబై దూసుకెళ్తే.. ఈ మ్యాచ్‌లో ఓటమి మూఠగట్టుకున్న గుజరాత్ టైటాన్స్ మాత్రం ఇంటిదారి పట్టింది.. ఐపీఎల్ 2025 ఎలిమినేటర్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసి.. గుజరాత్ టైటాన్స్ ముందు 229 పరుగుల విజయలక్ష్యాన్ని పెట్టగా.. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పో్యిన జీటీ 208 పరుగులకే పరిమితం అయ్యింది.. దీంతో, 20 పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్న ముంబై.. ఐపీఎల్ క్వాలిఫయర్-2లో అడుగుపెట్టింది.. ఇక, ఆదివారం రోజు క్వాలిఫయర్-2లో పంజాబ్ కింగ్స్‌తో తలబడబోతోంది ముంబై ఇండియన్స్..
Read Also: Off The Record: ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు.. జేసీ కామెంట్లతో టీడీపీ ఇరుకున పడుతుందా..?
జీటీ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ మొదటి ఓవర్‌లోనే ఔట్ అయినప్పటికీ, కుశాల్ మెండిస్ హిట్ వికెట్‌గా ఔటైనా, సాయి సుదర్శన్ తన ఆశలను నిలుపుకుంటూ, తృటిలో సెంచరీని కోల్పోయాడు.. 49 బంతుల్లో 1 సిక్స్, 10 ఫోర్లుతో 80 పరుగులు చేశాడు.. అంతకుముందు, IPL 2025 ఎలిమినేటర్‌లో గుజరాత్ టైటాన్స్ పై మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 228/5 అద్భుతమైన స్కోర్‌ను నమోదు చేసింది. రోహిత్ శర్మ 50 బంతుల్లో 81 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.. జానీ బెయిర్‌స్టో 47, సూర్యకుమార్ యాదవ్ 33, తిలక్ వర్మ 25, హార్దిక్ పాండ్య 22 పరుగులతో ముంబై భారీ స్కోర్‌లో భాగస్వామ్యం అయ్యారు.. అయితే, సాయి సుదర్శన్ 49 బంతుల్లో 80 పరుగులు చేయగా.. వాషింగ్టన్ సుందర్ 48, కమిందు మెండిస్ 20, రూథర్‌ఫోర్డ్ 24, రాహుల్ తెవాతియా 16, షారుక్ ఖాన్ 13 పరుగులు చేసినా.. గుజరాత్‌ను గెలిపించలేకపోయారు..
Read Also: AP SSC 2025 Valuation: SSC వాల్యుయేషన్‌లో లోపాలు.. ఐదుగురిపై వేటు
ఇక, ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 2, బుమ్రా, రిచర్డ్ గ్లిసన్, శాంట్నర్, అశ్వని కుమార్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.. మరీ ముఖ్యంగా బుమ్రా.. జీటీ బ్యాటర్లను కట్టడి చేశాడు.. మరోవైపు.. గుజరాత్ బౌలర్లలో సాయి కిశోర్ 2, ప్రసిద్ధ్ కృష్ణ 2, సిరాజ్ ఒక వికెట్ తీశారు..