PM Modi: 2002 సబర్మతి ఎక్స్‌ప్రెస్‌పై దాడి, గుజరాత్ అల్లర్ల గురించి ప్రధాని నరేంద్రమోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికన్ పాడ్‌కాస్టర్ లెక్స్ ఫ్రిడ్‌మాన్‌తో జరిగిన ఇంటర్వ్యూలో గుజరాత్ అల్లర్ల గురించి మాట్లాడారు. గోద్రాలో 2002 సబర్మతి ఎక్స్‌ప్రెస్‌పై జరిగిన దాడి "ఊహించలేని స్థాయిలో జరిగిన విషాదం" అని ఆయన అన్నారు. దీని తర్వాత జరిగిన అల్లర్లు ‘‘ప్రతీ ఒక్కరికి విషాదకరమైనవి’’గా చెప్పారు. 2002 తర్వాత 22 ఏళ్లలో గుజరాత్‌లో ఒక్క అల్లరి కూడా జరగలేదని చెప్పారు.
NCERT: నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) 12వ తరగతి స్కూల్ పుస్తకాల్లో కీలక మార్పులను చేసింది. పొలిటికల్ సైన్స్ పుస్తకాల నుంచి బాబ్రీ మసీదు కూల్చివేత అంశాన్ని తీసేసింది.
2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానో గ్యాంగ్‌రేప్ కేసులో 11 మంది రేప్ దోషులలో ఒకరు గుజరాత్ ప్రభుత్వ కార్యక్రమంలో వేదికపై బిజెపి ఎంపి, ఎమ్మెల్యేతో కనిపించారు.
BBC Documentary On Modi: ఇండియాతో పాటు బ్రిటన్ లో కూడా వివాదాస్పదం అయింది ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంట్. 2002 గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ పాత్రపై బీబీసీ ‘ ఇండియా: ది మోదీ క్వశ్చన్’ అనే డాక్యుమెంటరీని రూపొందించింది. దీనిపై బీజేపీతో తీవ్ర అభ్యంతరం తెలిపింది. భారత ప్రభుత్వం దీన్ని ‘వలసవాద మనస్తత్వం’గా అభివర్ణించింది.
TISS students to screen BBC documentary on PM Modi: ప్రధాని నరేంద్రమోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ వివాదాస్పదం అయింది. భారత ప్రభుత్వం ఈ డాక్యుమెంటరీని బ్లాక్ చేసింది. భారత ప్రభుత్వం దీన్ని వలసవాద మనస్తత్వంగా అభివర్ణించింది. ఈ డాక్యుమెంటరీ ఇటు ఇండియాతో పాటు యూకేలో కూడా చర్చనీయాంశం అయింది. అయితే ఇప్పుడు కొన్ని యూనివర్సిటీల్లోని విద్యార్థి సంఘాలు, విద్యార్థులు ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఢిల్లీలోని జవహర్ లాల్…
BBC Documentary on Modi: ప్రధాని నరేంద్రమోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ రచ్చకు దారి తీసింది. యూకే-ఇండియా సంబంధాలపై ప్రభావం పడేలా ఉండటం ఉంది. మరోవైపు యూకే, ఇండియాల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చర్చల్లో ఉండగా ఈ డాక్యుమెంటరీని బీబీసీ విడుదల చేయడంపై అక్కడి ఎంపీలు మండి పడుతున్నారు. ఇదిలా ఉంటే భారత ప్రభుత్వం ఈ వీడియోను బ్యాన్ చేసింది. వలసవాద మనస్తత్వానికి నిదర్శనం ఈ డాక్యుమెంటరీ అంటూ భారత ప్రభుత్వం వ్యాఖ్యానించింది.
Bilkis Bano Case: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బిల్కిస్ బానో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల బిల్కిస్ బానో అత్యాచారం కేసులోొ 11 మంది దోషులను ముందస్తుగా విడుదల చేసింది గుజరాత్ ప్రభుత్వం. అయితే ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు బాధితురాలు బిల్కిస్ బానో. ఇదిలా ఉంటే బిల్కిస్ బానో దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించకుండా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బేలా ఎం త్రివేది తప్పుకున్నారు.
Rahul Gandhi targets PM over release of Bilkis Bano case convicts: బిల్కిస్ బానో అత్యాచార ఘటనలో నిందితులుగా ఉన్న 11 మందిని విడుదల చేయడంపై కాంగ్రెస్ పార్టీ బీజేపీపై ఫైర్ అవుతోంది. గ్యాంగ్ రేప్, హత్యలు చేసిన నిందితులను సత్ప్రవర్తన ద్వారా విడుదల చేయడంపై బీజేపీ, ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ. నారీ శక్తి అని స్వాతంత్య్రదినోత్సవం రోజున ప్రసంగించిన ప్రధాని మోదీ కొన్ని గంటల్లోనే…
Bilkis Bano Case- Release of 11 accused: 2002 గుజరాత్ అల్లర్లలో బిల్కిస్ బానోపై అత్యాచార ఘటన దేశాన్ని కుదిపేసింది. ఈ నేరానికి పాల్పడిన 11 మందికి కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే తాజాగా గుజరాత్ ప్రభుత్వం వీరిని విడుదల చేసింది. 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సత్ప్రవర్తన కలిగిన ఖైదీనలు విడుదల చేయాల్సిందిగా కేంద్రం మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే ఈ మార్గదర్శకాల కింది బిల్కిస్ బానో కేసులో శిక్ష పడిన…
భారతదేశ చరిత్రలో మాయని మచ్చగా మిగిలాయి 2002లో గుజరాత్ లో జరిగిన గోద్రా అల్లర్లు. ఈ అల్లర్ల చుట్టూ రాజకీయం ఇన్నేళ్లయినా ఇంకా కొనసాగుతూనే ఉంది. అయోధ్య నుంచి వస్తున్న 59 మంది కరసేవకులను ఉన్న రైలు బోగీని కాల్చేయడంతో వారంత మరణించారు. ఈ ఘటన ఫిబ్రవరి, 2002లో చోటు చేసుకుంది. ఈ ఘటన అనంతరం గుజరాత్ వ్యాప్తంగా మతకలహాలు జరిగాయి. తాజాగా గోద్రా అల్లర్ల కేసులో నిందితుడు రఫిక్ బతుక్ జీవిత ఖైదు విధించించారు పంచమహల్…