బిల్కిస్ బానో కేసులో భారత సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో 11 మంది నిందితుల క్షమాభిక్షను సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
2002లో గోద్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్‌లో అల్లర్లు జరిగినప్పుడు తనపై అత్యాచారానికి పాల్పడ్డ దోషులను ముందస్తుగా విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ బాధితురాలు బిల్కిస్ బానో వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది.
గుజరాత్ ఆర్థిక మంత్రి కను దేశాయ్ శుక్రవారం రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. గత ఏడాది డిసెంబర్‌లో అధికారం చేపట్టిన సీఎం భూపేంద్ర పటేల్ నేతృత్వంలోని కొత్త భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వానికి ఇది మొదటి బడ్జెట్.
గుజరాత్ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఏడాదికి 2 ఉచిత సిలిండర్లు ఇవ్వాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి జితు వాఘాని సోమవారం ప్రకటించారు.