Centre Is Working On Providing 10 Lakh Jobs, Says PM Modi: కేంద్ర ప్రభుత్వం పది లక్షల ఉద్యోగాలను కల్పించేందుకు కసరత్తు చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. శనివారం గుజరాత్ ప్రభుత్వం నిర్వహించిన ‘రోజ్ గార్ మేళా’లో వీడియో సందేశం ఇచ్చని ఆయన, యువతకు ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య పెరుగుతుందని చెప్పారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగిన ఈ కార్యక్రమంలో 5,000 మంది వ్యక్తులకు గుజరాత్ పంచాయతీ సర్వీస్ బోర్డ్ నుంచి…
Gujarat Government's Big Move On Uniform Civil Code: గుజరాత్ ఎన్నికలు ఈ ఏడాది చివర్లో జరగనున్నాయి. ఇప్పటికే ఉత్తరాఖండ్ రాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం, రేపో మాపో గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ కూ0డా విడుదల చేయనుంది. ఇదిలా ఉంటే గుజరాత్ లో మరోసారి అధికారం చేపట్టాలని బీజేపీ అనుకుంటోంది. కాంగ్రెస్, ఆప్ పార్టీలు మాత్రం బీజేపీని అధికారం నుంచి గద్దె దించాలని పోరాడుతున్నాయి.
No Fine For Breaking Traffic Rules During Diwali: ట్రాఫిక్ ఉల్లంఘించినా పర్వాలేదు.. ఫైన్ లాంటివి ఏమీ ఉండవు. గుజరాత్ ప్రభుత్వం అక్కడి ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. అయితే ఇది కేవలం దీపావళికి మాత్రమే. దీపావళి పండగ వేళ ట్రాఫిక్ ఉల్లంఘించినా.. ఎలాంటి జరిమాన విధించబడదని గుజరాత్ సర్కార్ ప్రకటించింది. గుజరాత్ హోంశాక సహాయమంత్రి హర్ష్ సంఘవి శుక్రవారం సూరత్ లో ఈ విషయాన్ని ప్రకటించారు.
Prime Minister Narendra Modi will visit temples: ప్రతీ దీపావళికి ప్రధాని నరేంద్ర మోదీ సాయుధబలగాలతో గడుపుతుంటారు. అయితే ఈసారి అందుకు భిన్నంగా దేవాలయాల బాట పడుతున్నారు ప్రధాని మోదీ. అక్టోబర్ 24న దీపావళికి రెండు రోజుల ముందు ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు మోదీ. అక్టోబర్ 21 కేదార్ నాథ్, బద్రీనాథ్ దేవాలయాలను సందర్శించనున్నారు. ఆ తరువాత అక్టోబర్ 23న ఛోటీ దీపావళి రోజు ఆయోధ్యలో పర్యటించనున్నారు.
Himachal pradesh Election schedule: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తాజాగా ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 12న జరగనున్నాయి. ఒకే దశలో ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరుపుతామని.. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
PM Modi To Declare Modhera As India's 1st Solar-Powered Village: దేశంలో గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీని ప్రోత్సహించే విధంగా అడుగులు పడుతున్నాయి. పర్యావరణ పరిరక్షణతో పాటు కాలుష్యాన్ని నివారించేందుకు సోలార్ ఎనర్జీ, విద్యుత్ వాహనాలను కేంద్రం ప్రోత్సహిస్తోంది. దీంతో పాటు ముడి చమురు దిగుమతిని తగ్గించుకుని, విదేశీమారక నిల్వలను పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇదిలా ఉంటే దేశంలోనే తొలి సోలార్ గ్రామంగా గుజరాత్ రాష్ట్రంలో మోధేరా గ్రామం రికార్డులకెక్కనుంది. గుజరాత్ రాష్ట్రంలోని మోహసానా…
Gujarat AAP leader arrested for raping: ఈ ఏడాది చివర్లో గుజరాత్ ఎన్నికలు జరగబోతున్నాయి. మరోసారి బీజేపీ గుజరాత్ లో గెలుపొందాలని భావిస్తోంది. 2024 ఎన్నికల ముందు సెమిఫైనల్స్ గా ఎన్నికలను భావిస్తోంది. ఇదిలా ఉంటే పంజాబ్ రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకున్న ఉత్సాహంతో గుజరాత్ లో కూడా పాగా వేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తోంది. ఇదిలా ఉంటే ఆప్ నేతలు మాత్రం పలు కేసుల్లో ఇరుక్కుంటుండం ఆ పార్టీకి మింగుడపడటం లేదు.
Congress is finished in Gujarat, says Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పనైపోయిందని అన్నారు. గుజరాత్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గుజరాత్ రాష్ట్రంలో పర్యటిస్తున్న ఆయన అహ్మదాబాద్ నగరంలో పారిశుద్ధ్య కార్మికులతో సమావేశం అయిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
CM Arvind kejriwal comments on BJP over Gujarat elections: ఈ ఏడాది చివర్లో గుజరాత్ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఈ సారి గుజరాత్ లో పాగా వేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) భావిస్తోంది. బీజేపీ నుంచి అధికారాన్ని తీసుకోవాలని ఆప్ భావిస్తోంది. ఇదిలా ఉంటే ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ లో రెండు రోజుల పాటు పర్యటిస్తున్నారు. తాజాగా ఆయన బీజేపీ కార్యకర్తలను, నాయకులును ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు…
రాజస్తాన్ ఉదయ్ పూర్ వేదికగా కాంగ్రెస్ పార్టీ ‘నవ కల్పన్ శింతన్ శిబిర్’ నిర్వహిస్తోంది. వరస పరాజయాలను నుంచి బయటపడేందుకు పార్టీకి కొత్త రూపు సంతరించేలా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం బీజేపీ వంతు వచ్చింది. గుజరాత్ అహ్మదాబాద్ వేదికగా నేటి నుంచి బీజేపీ ‘ చింతన్ శిబిర్’ ను ప్రారంభించనుంది. 2022 ఏడాది చివర్లో గుజరాత్ ఎన్నికలు ఉన్న నేపథ్యంతో అనుసరించాల్సిన వ్యూహాల గురించి చర్చించడానికి ఈ చింతన్ శిబిర్ ను…