Ahead Of Gujarat Elections, Another Congress MLA Joins BJP: గుజరాత్ లో బీజేపీ అధికారానికి గండికొడదాం అని అనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి భారీ షాకులు తగులుతున్నాయి. వరసగా రెండు రోజుల్లో వ్యవధిలో ఆ రాష్ట్రానికి చెందిన కీలక నేతలు బీజేపీ పార్టీలో చేరారు. సీనియర్ ఎమ్మెల్యే భగవాన్ బరాద్ బుధవారం శాసన సభ్యత్వానికి, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈయన బీజేపీ పార్టీలో చేరనున్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. వరుసగా ఐదోసారి గెలిచి అధికారాన్ని నిలుపుకోవాలనే పట్టుదలతో ఉంది.
Gujarat police denied stone pelting on Asaduddin Owaisi: ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రయాణిస్తున్న వందేభారత్ ట్రైన్ పై దాడి జరిగిందని ఆరోపించారు ఆపార్టీ నేత వారిస్ పఠాన్. అయితే ఈ వాదనలను పోలీసులు ఖండించారు. అలాంటిదేం జరగలేదని గుజరాత్ పోలీసులు కొట్టిపారేశారు. తాను పార్టీ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రయాణిస్తున్న అహ్మదాబాద్ నుంచి వందేభారత్ రైలులో ప్రయాణిస్తున్న సమయంలో కొంతమంది రాళ్ల దాడికి పాల్పడినట్లు వారిస్ పఠాన్ ఆరోపించారు.…
అక్టోబర్ 30వ తేదీన గుజరాత్‌లో మోర్బీ వంతెన కూలిన దుర్ఘటనలో దాదాపు 135 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు.
గుజరాత్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ బీజేపీ కొత్త ఎన్నికల నినాదాన్ని గుజరాతీలో ప్రారంభించారు. 'నేను ఈ గుజరాత్‌ని తయారు చేశాను' అంటూ ఎన్నికల నినాదాన్ని ప్రారంభించారు.
BJP to make clean sweep in Gujarat, Himachal Pradesh elections: లోక్ సభ సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాదిన్నర మాత్రమే గడువు ఉంది. మరోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం అందరి చూపు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలు సార్వత్రిక ఎన్నికల ముందు ప్రజల నాడిని తెలుపుతాయని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. ఇప్పటికే ఈ రెండు…
గుజరాత్‌లో ఎన్నికల తేదీలు ప్రకటించిన వేళ పలు పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు తమదైన శైలిలో ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. సీఈసీ రాజీవ్ కుమార్ ఎన్నికలకు సంబంధించిన వివరాలను ప్రకటించారు. మొత్తం 182 అసెంబ్లీ స్థానాలు ఉన్న గుజరాత్ అసెంబ్లీ ఐదేళ్ల కాలపరిమితి ఫిబ్రవరి 18,2023తో ముగుస్తోంది. గత 25 ఏళ్లుగా గుజరాత్ లో బీజేపీ తిరుగలేని అధికారాన్ని చెలాయిస్తోంది. ఈ సారైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తాను అధికారంలో ఉన్నానని చెబుతోంది.
Gujarat Election Dates To Be Announced At Noon Today: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు మధ్యాహ్నం ప్రకటించనుంది. డిసెంబర్-జనవరి నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ ను వెల్లడించిన ఈసీ.. ఈ రోజు గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనుంది. ఫిబ్రవరి 18,2023తో గుజరాత్ అసెంబ్లీ ఐదేళ్ల కాల పరిమితి ముగియనుంది. దీంతో ఈ మధ్యలోనే ఎన్నికలను నిర్వహించనుంది ఎన్నికల…
Arvind Kejriwal said BJP is cheating on Uniform Civil Code: గుజరాత్ ప్రభుత్వం ఎన్నికల ముందు కీలక నిర్ణయం తీసుకుంది. యూనిఫాం సివిల్ కోడ్ పై కమిటీని ఏర్పాటు చేస్తూ గుజరాత్ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అంతకు ముందు ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా యూనిఫాం సివిల్ కోడ్ అమలు చేసేందుకు సిద్ధం అయింది. ఇదిలా ఉంటే బీజేపీ తీసుకున్న నిర్ణయంపై పలు విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఎన్నికల్లో భాగంగానే బీజేపీ ఈ నిర్ణయం తీసుకుందని..…