Ravindra Jadeja Wife: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. వరుసగా ఐదోసారి గెలిచి అధికారాన్ని నిలుపుకోవాలనే పట్టుదలతో ఉంది. డిసెంబరు 1, 5 తేదీల్లో రెండు విడతల్లో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను బీజేపీ సిద్ధం చేసింది. ఈ జాబితాలో మూడు సంవత్సరాల క్రితం బీజేపీలో చేరిన క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివా జడేజా పేరు కూడా ఉన్నట్లు, అభ్యర్థులను ఖరారు చేయడానికి బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఈ రోజు సమావేశం కానుందని రాజకీయ వర్గాలు వెల్లడించాయి. గుజరాత్‌లో 27 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ.. ఈ ఎన్నికల్లో కొందరు సీనియర్లను పక్కన పెట్టాలని యోచిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, మాజీ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ వంటి సీనియర్ నేతలను పోటీకి దింపకపోవచ్చు. 75 ఏళ్ల వయోపరిమితి నిబంధనలు అమలుచేస్తుండటంతో వారు అనర్హులు. ఎంపీలు, ఎమ్మెల్యేల బంధువులు కూడా అనర్హులు. ఈ నేపథ్యంలో ఈ సీనియర్ నేతలకు చోటుదక్కే అవకాశం లేదు.
GVL Narasimha Rao: ప్రధాని మోడీ వైజాగ్ పర్యటన.. ఎంపీ జీవీఎల్ ఆసక్తికర వ్యాఖ్యలు
రవీంద్ర జడేజా భార్య రివా జడేజా మెకానికల్ ఇంజినీర్ డిగ్రీ పూర్తి చేశారు. అంతే కాకుండా, కాంగ్రెస్ సీనియర్ నేత హరిసింగ్ సోలంకికి బంధువు. ఆమె 2016లో రవీంద్ర జడేజాను వివాహం చేసుకుంది. ఆమె రాజ్‌పుత్ కమ్యూనిటీకి చెందిన కర్ణి సేనకు కూడా నాయకురాలు.కాంగ్రెస్‌కు నుంచి బీజేపీలో చేరినహార్దిక్ పటేల్, అల్పేష్ ఠాకూర్‌లకు టికెట్ దక్కే అవకాశాలు ఉన్నాయి. ఈసారి పెద్ద సంఖ్యలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు జాబితాలో ఉండరని పలు వర్గాలు వెల్లడించాయి.బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలోని ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ తదితరులు సభ్యులుగా ఉన్న సెంట్రల్ కమిటీ సమావేశం అనంతరం జాబితాను ప్రకటించనున్నట్లు సమాచారం. ప్రధాని మోడీ, అమిత్ షాల సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో డిసెంబర్ 1, 5 తేదీల్లో ఓటింగ్ జరగనుంది. డిసెంబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి, హిమాచల్ ప్రదేశ్‌లో కూడా బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోవాలని భావిస్తోంది.