గుండ్లవల్లేరు ఘటనలో నూటికి నూరు శాతం హిడెన్ కెమెరాలు అంశం దాగి ఉందని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేశారు.. కడప నగరంలోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడిన ఆమె.. రెండు షవర్లను చీకట్లో పోలీసులు ఎత్తుకెళ్లడంపై తమకు అనుమానాలు ఉన్నాయన్నారు.. నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ బెదిరించడం.. తెల్లారేసరికి పరిస్థితులు మారుతాయి అనడం.. అనుమానాలకు తావిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.
కృష్ణా జిల్లా గుడివాడలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల వ్యవహారం సీఈఆర్‌టీ సేవలను ఉపయోగించి విచారణ చేసి.. కొంత క్లారిటీకి వచ్చారు.. పోలీసు బృందాల దర్యాప్తు అప్డేట్స్ పై ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు.. కళాశాలలో పోలీసులు నేరుగా చేసిన దర్యాప్తులో ఎటువంటి స్పై కెమెరాలు గుర్తించలేదని ఆయన స్పష్టం చేశారు.. క్రిమినల్ కేసుల్లో ఏపీలో తొలిసారిగా ఢిల్లీకి చెందిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT) సేవలు వినియోగించాం. విద్యార్థులు, తల్లిదండ్రులు,…
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు కళాశాల ఘటనపై విచారణకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.. బాలికల హాస్టల్ లో హిడెన్ కెమెరాలు పెట్టారని విద్యార్థుల ఫిర్యాదుపై దుమారం రేగిన విషయం విదితమే కాగా.. ఇప్పటికే ఈ ఘటనపై విచారణ చేపట్టారు పోలీసులు.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు లోతైన విచారణ చేపట్టారు పోలీసులు..
గుడ్లవల్లేరు కాలేజ్ ఘటనపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఆడపిల్లల జీవితాలతో ముడిపడిన అంశంపై క్లారిటీ ఇవ్వడానికి ఎన్ని రోజులు కావాలని అడిగారు. సీరియస్‌గా తీసుకోకపోతే ఇదో అలవాటుగా మారిపోతుందన్నారు.