Gudivada Amarnath Reveals First Report On Sahithi Pharma Fire Accident: సాహితీ ఫార్మాలో చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక చేరింది. ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. ఈ ఘటనపై డిప్యుటీ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ సహా వివిధ విభాగాలు విచారణ ప్రారంభించాయని అన్నారు. ఉదయం 11:10 గంటలకు సాల్వెంట్ రికవరీ యూనిట్‌లో ప్రమాదం జరిగిందని ప్రాథమిక నివేదికలో వెల్లడైందని తెలిపారు. సుమారు ఐదు గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ జరిగిందన్నారు. ఈ ఘటనలో మొత్తం ఏడుగురు తీవ్ర గాయాలపాలవ్వగా.. ఇద్దరు మృతి చెందారన్నారు.
Rashmi Gautham : వెరైటీ డ్రెస్సులో కిల్లింగ్ ఫోజులతో మతిపోగొడుతున్న రష్మీ.
నూకరాజు అనే కార్మికుడు 95 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నారని.. ఆయన పరిస్థితి ప్రమాదకరంగా ఉందని మంత్రి అమర్నాథ్ వెల్లడించారు. మరో ముగ్గురు బాధితులకు 50 శాతం పైగా గాయాలు అయ్యాయన్నారు. వీరిలో అంతర్గత అవయవాలు దెబ్బతినడంతో.. వీరి ఆరోగ్యం కొంత క్రిటికల్‌గా ఉందన్నారు. తాము మెరుగైన వైద్య సేవలు అందిస్తామని.. అవసరమైతే ఎయిర్ లిఫ్ట్ చేసి, హయ్యర్ మెడికల్ సెంటర్‌కు బాధితుల్ని పంపించాలని సీఎం ఆదేశించారని తెలియజేశారు. సేఫ్టీ ఆడిట్ విషయంలో యంత్రాంగం పకడ్బందీగా వ్యవహరిస్తోందని అన్నారు. ఎల్జీ పాలిమర్స్, బ్రాండిక్స్ ప్రమాదం తర్వాత తాము కీలక నిర్ణయాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. గ్రీన్ ఇండస్ట్రీస్ జోన్‌గా ఉన్న అచ్యుతాపురంను రెడ్ జోన్‌గా మార్చడంతో.. అక్కడ ఫార్మా కంపెనీలు ఏర్పాటు అయ్యాయని స్పష్టం చేశారు.
Pawan Kalyan: పవన్ హెచ్చరిక.. సైలెన్సర్లు బిగించుకోకపోతే, మంత్రుల చిట్టా విప్పుతా
కాగా.. సాహితీ ఫార్మా కంపెనీలో రెండు రియాక్టర్లు పేలడంతో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కెమికల్స్‌ని అన్‌లోడ్ చేస్తున్న సమయంలో రసాయనాలు ఒత్తిడికి గురవ్వడంతో.. కంటెనర్‌కు నిప్పంటుకుంది. అది నిమిషాల్లో వ్యాప్తి చెందడంతో.. ఫ్యాక్టరీ మొత్తం మంటలు వ్యాపించాయి. ఈ దెబ్బకు సాహితీ ఫార్మా యూనిట్-1 పూర్తిగా కాలి బూడిదైంది. మంటల్ని ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది.. 10 ఫైరింజన్లు, స్కైలిఫ్టర్ల సహాయంతో 5 గంటలు శ్రమించి, ఎట్టకేలకు మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు.