GST on Food Items: ఇప్పటికే పెట్రోల్, డీజిల్ సహా పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో సతమతమవుతున్న సామాన్య ప్రజలపై మరో భారం పడనుంది. పేద, మధ్య తరగతి వర్గాలపై నిత్యావసర సరుకుల భారం మరింత పెరగనుంది. ఇటీవల జూన్ 28, 29న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన చంఢీగఢ్‌లో జరిగిన 47వ జీఎస్టీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ నెల 18 నుంచి మరికొన్ని నిత్యావసర వస్తువుల ధరలు మరింత పెరగనున్నాయి. ఇక నుంచి రోజు ఆహార పదార్థాలపై ఎక్కువ ధర చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఆహార పదార్థాలలో పాలు కూడా ఉన్నాయి. ప్యాక్ చేసిన పెరుగు, మజ్జిగ, లస్సీ, పన్నీర్ తదితరాలపై 5 శాతం జీఎస్టీ విధించనున్నారు. ఆయా వస్తువులపై ఇంతకుముందు ఇన్‌పుట్ టాక్స్ ప్రయోజనం ఉండగా, ఇప్పుడు తొలగించనున్నారు. ప్యాక్ చేసిన బియ్యం, గోధుమలు, పిండిపై కూడా ఇన్‌పుట్ టాక్స్ ప్రయోజనం దూరం కానుండటం వల్ల వాటి ధరలు పెరగనున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం గృహ బడ్జెట్‌పై ప్రభావం చూపుతుండగా.. సామాన్యులకు మాత్రం ఊరట లభించడం లేదు.
Co-working: కలిసి పనిచేద్దాం రా. కో-వర్కింగ్‌కి జై అంటున్న ఉద్యోగులు.
అంతేకాకుండా బెల్లం వంటి ప్రీ-ప్యాకేజ్డ్ లేబుళ్లతో సహా వ్యవసాయ వస్తువుల ధరలు కూడా జూలై 18 నుండి పెరగనున్నాయి. ఈ ఉత్పత్తులపై పన్నులు పెంచారు. ప్రస్తుతం బ్రాండెడ్, ప్యాక్ చేసిన ఆహార పదార్థాలపై 5 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. ప్యాక్ చేయని, లేబుల్ లేని ఉత్పత్తులు పన్ను రహితంగా ఉంటాయి. చెక్కుల జారీ సహా హోటల్ గదుల అద్దెలు, ఎల్‌ఈడీ లైట్ల ధరలు కూడా ప్రియం కానున్నాయి. చెక్కుల జారీకి బ్యాంకులు వసూలు చేసే ఫీజుపై జీఎస్టీ 18 శాతానికి పెరగనుంది. ఆస్పత్రుల్లో రూ.5 వేల కన్నా( నాన్ ఐసీయూ) కన్నా ఎక్కువ ధర ఉండే గదులను అద్దెకు ఇస్తే 5 శాతం జీఎస్టీ విధించనున్నారు. రోజుకు రూ. 1000 అద్దె ఉంటే హోటల్ గదులపై 12 శాతం జీఎస్టీ, ఎల్ఈడీ లైట్లు 18 శాతం జీఎస్టీ, బ్లేడ్లు, పేపర్ కటింగ్ కత్తెరలు, పెన్సిల్ షార్పనర్లు, స్పూన్లు, ఫోర్కులు, స్కిమ్మర్లు, కేక్ సర్వర్లపై గతంలో 12 శాతం జీఎస్టీ ఉండగా.. ఇప్పుడు ఇది 18 శాతానికి పెరగనుంది.