Minister Payyavula: జీఎస్టీ సంస్కరణల మీద ప్రధాని మోడీ ప్రకటన చేసిన నెల రోజుల వ్యవధిలోనే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ దాన్ని సుసాధ్యం చేసింది అని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. GST సంస్కరణలను అన్ని పార్టీలు ముక్తకంఠంతో ఆమోదించడం సక్సెస్ కి ఉదాహరణ అన్నారు. రెండు స్లాబ్స్ విధానం అమలు చేయడం ఈజీ వ్యవహారం కాదు.. దాని వెనుక విస్తృతమైన కృషి దాగి ఉందన్నారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ టిపికల్ ఇండియన్ మదర్ అని ప్రసంశించారు. ఎక్కడ ఖర్చు పెట్టాలో.. ఎక్కడ నియంత్రించాలో తెలిసిన సీతారామన్ అద్భుతమైన పద్ధతిని ప్రతిపాదించి అమలు చేస్తున్నారని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల పేర్కొన్నారు.
Read Also: ilaiyaraaja : ఇళయరాజా కారణంగా నెట్ ఫ్లిక్స్ నుండి స్టార్ హీరో సినిమా డిలీట్
అయితే, విభిన్నపార్టీలు రాజకీయ వైరుధ్యాలతో పని చేస్తున్నప్పటికీ, జీఎస్టీ సంస్కరణల విషయంలో భిన్నాభిప్రాయాలు లేకుండా వ్యవహరించారు అని పయ్యావుల కేశవ్ చెప్పుకొచ్చారు. ఫైనాన్స్ మంత్రి దగ్గర అందరూ లాబీయింగ్ చేస్తే పేద వాళ్ల కోసం లాబీయింగ్ చేసిన ఆర్థిక మంత్రి నిర్మలమ్మ.. ఎన్నికల ముందు రేట్లు తగ్గించడం చూస్తాం.. కానీ, దేశం కోసం పని చేస్తున్న ఎన్డీయే ప్రభుత్వం నిత్యం సంస్కరణ విధానంలో పని చేస్తుంది అన్నారు. MSME లకు క్రెడిట్ గ్యారెంటీస్ సహా కీలక విధానాలు అమలు చేస్తున్నారు అని ఆర్థిక మంత్రి కేశవ్ తెలిపారు.