ఢిల్లీ లో జరిగిన సమావేశంలో జీఎస్టీ రేషనలైజేషన్ (GST Rationalisation) అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈ సమావేశానికి ఎనిమిది రాష్ట్రాల మంత్రులు హాజరయ్యారు. ఇందులో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ, రేట్ రేషనలైజేషన్ పేరుతో రాష్ట్రాలకు భారీ రెవెన్యూ నష్టం సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
Restaurant Worker Gets RS 4.60 Cr Notice in Nandyal: నంద్యాల జిల్లాలో జీఎస్టీ కలకలం రేపింది. మిడుతూరు మండలం పైపాలెంకు చెందిన నవీన్ కుమార్ రెడ్డి అనే వ్యక్తికి రూ.4.60 కోట్లు జీఎస్టీ చెల్లించాలని నోటీసులు వచ్చాయి. రెస్టారెంట్ ఉద్యోగినైన తనకు కోట్లలో జీఎస్టీ రావడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు. జీఎస్టీ నోటీసులపై అటు మిడుతూరు, ఇటు హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించినా ఫిర్యాదు తీసుకోలేదు. ఏమి చేయాలో అర్థంకాక సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించేందుకు…
GST Notice: కర్ణాటకలోని హవేరి జిల్లాకి చెందిన ఓ చిన్న కూరగాయల వ్యాపారి ఇప్పుడు పెద్ద సమస్యలో చిక్కుకున్నాడు. నాలుగేళ్లుగా చిన్న కూరగాయల షాపు నడుపుతున్న శంకర్‌గౌడ హడిమణి అనే వ్యాపారికి జీఎస్టీ అధికారులు ఏకంగా రూ. 29 లక్షల పన్ను నోటీసు జారీ చేశారు. ఈ నోటీసుతో ఆయన సమస్యల్లో పడ్డారు. హవేరి మున్సిపల్ హై స్కూల్ వద్ద తన కూరగాయల షాపును నడుపుతున్న శంకర్‌గౌడ, రైతుల నుండి నేరుగా కూరగాయలు కొనుగోలు చేసి స్వయంగా…
స్వయం ఉపాధి కోసం కొందరు కూరగాయల వ్యాపారం చేస్తుంటారు. పెట్టిన పెట్టుబడిపోను ఎంతో కొంత లాభాన్ని ఆర్జిస్తుంటారు. అయితే కూరగాయలు అమ్ముకునే ఓ విక్రేతకు జీఎస్టీ అధికారులు షాకిచ్చారు. అతనికి జీఎస్టీ అధికారులు రూ. 29 లక్షల నోటీసు పంపారు. వస్తు, సేవల పన్ను నిబంధనల ప్రకారం ఈ భారీ చెల్లింపు చేయమని కోరారు. దీంతో అతడు షాక్ కి గురయ్యాడు. అతడు కర్ణాటకకు చెందిన శంకర్‌గౌడ హదిమణి. అసలు 29 లక్షల జీఎస్టీ నోటీస్ ఎందుకు…
April 1: ఏప్రిల్ 1 నుంచి కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. UPI, GST, పన్ను రేట్లలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా పౌరుల్ని ప్రభావితం చేస్తే ఆర్థిక మార్పులు అమలులోకి రానున్నాయి. పన్ను స్లాబుల మార్పుల నుంచి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI), యూనిఫైడ్ పెన్షన్ పథకం ప్రారంభం వరకు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొత్త పన్ను స్లాబులు, రేట్లు: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో వార్షిక బడ్జెట్‌లో కొత్త పన్ను స్లాబులు,…
CAG Report : ఢిల్లీ ఎక్సైజ్ విధానం, మద్యం సరఫరాకు సంబంధించిన నియమాల అమలులో తీవ్రమైన లోపాలను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) తాజా నివేదిక బయటపెట్టింది.
పొగ తాగే వారికి ప్రభుత్వం షాకివ్వబోతోంది. త్వరలో సిగరెట్ల ధరలు భారీగా పెరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీ పెంచడాన్ని పరిశీలిస్తోంది. దీంతో పన్ను ఆదాయం తగ్గదు. ప్రస్తుతం వీటిపై 28 శాతం జీఎస్టీ కాకుండా ఇతర ఛార్జీలు కూడా విధిస్తున్నారు. దీంతో మొత్తం పన్ను 53 శాతానికి చేరుకుంది. అయితే ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన 75 శాతం కంటే చాలా తక్కువ. సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై…
జనవరిలో భారీగా జీఎస్టీ వసూళ్లు భారీగా పెరిగాయి. జనవరిలో మొత్తంగా జీఎస్టీ ఆదాయం రూ.1,95,506 కోట్లు వసూలు కాగా.. గతేడాదితో పోలిస్తే 12.3 శాతం పెరగడం విశేషం.
Chamala Kiran Kumar Reddy : పద్మ శ్రీ అవార్డుల విషయంలో పార్లమెంట్ జీరో అవర్ లో లెవనెత్తుతా అని అన్నారు భువనగిరి ఎంపీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్ కార్పొరేటర్ కాదు కేంద్ర మంత్రి అని గుర్తు పెట్టుకోవాలని, హరీష్ రావు ముందు కేసీఆర్ ను ప్రజలకు దర్శనం ఇవ్వాలని చెప్పాలన్నారు చామల కిరణ్ కుమార్. కేంద్రం బీహార్‌కు, ఏపీకి ఇచ్చిన ప్రాధాన్యత తెలంగాణకు ఇవ్వట్లేదని…
2024 ఏడాది భారత ఆర్థిక వ్యవస్థకు మెరుగ్గా పరిగణించారు. జనవరి నుంచి డిసెంబర్ వరకు జీఎస్టీ వసూళ్లు ద్వారా ప్రభుత్వానికి మొత్తం 21 లక్షల 51 వేల కోట్ల రూపాయలు వచ్చాయి. నవంబర్‌తో పోలిస్తే డిసెంబర్లో జీఎస్టీ వల్ల ప్రభుత్వానికి కాస్త తక్కువ ఆదాయం వచ్చింది. నవంబర్‌లో జీఎస్టీ వసూళ్లు రూ.1.82 లక్షల కోట్లు కాగా.. డిసెంబర్లో రూ.1.77 లక్షల కోట్లకు తగ్గింది.