Minister KTR : తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విటర్ అకౌంట్ కు ఒక విచిత్రమైన కంప్లైంట్ వచ్చింది. చెరువు మాయమైందంటూ ఫ్యూచర్ ఫౌండేషన్స్ సొసైటీ ప్రతినిధులు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్‌లో చేసిన ఫిర్యాదు చేశారు.
ప్రభుత్వ వైఖరికి నిరసనగా రేపు ఇంటర్ విద్యాసంస్థల బంద్ కు పిలుపునిస్తున్నామని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఇంటర్ విద్యలో కార్పొరేట్ కళాశాలలను ప్రభుత్వ నియంత్రించడం లేదంటూ కార్పొరేట్ విద్యాసంస్థల ముందు ఏబీవీపీ ఆందోళనకు పిలుపునిచ్చింది. నారాయణగూడ లోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాల ముందు ఏబీవీపీ నాయకులు ధర్నా చేపట్టారు. కార్పొరేట్ విద్యాసంస్థలపై ఇంటర్ బోర్డ్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఒకే పేరుతో…
ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ ఎపిసోడ్ రోజుకో మలుపులు తిరుగుతోంది. నర్సీపట్నంలో టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ఇంటి దగ్గర గోడ కూల్చివేత ఘటనలో హైడ్రామా చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. రాత్రి పూట కూల్చివేతలపై కోర్టు వ్యాఖ్యలకు సీఎం జగన్ ఏం సమాధానం చెపుతారు? అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. తప్పు చేసిన అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. అయ్యన్నది కబ్జా కాదు.. ఇడుపులపాయలో వైఎస్ కుటుంబం చేసింది కబ్జా. ఇడుపులపాయలో వైఎస్ కుటుంబం 600 ఎకరాల దళితుల…
పేరుకే అది ఒంగోలు నగర పాలక సంస్థ. నగరంలో మూడు-నాలుగు రోజులకు ఒక సారే నీళ్లిస్తారు. అది కూడా అర్థరాత్రి దాటాకే. ఇక శివారు ప్రాంతాలకు అరకొర ట్యాంకర్లే గతి. దీంతో గుక్కెడు మంచినీళ్ల కోసం అవస్థలు పడాల్సివస్తోంది. మూడు లక్షలకు పైగా జనాభా ఉన్న ఒంగోలు నగరంలో ఈ దుస్థితి ఇంకెన్నాళ్ళు అంటున్నారు ప్రజలు. ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మంచినీటి కోసం జనం జాగారాలు చేయాల్సి వస్తోంది. ఒంగోలు నగరంలో…
జూనియర్ డాక్టర్లతో సేవ చేయించుకున్నారు. స్టైఫండ్ మాత్రం ఇవ్వలేదు. అడిగిన ప్రతిసారి రేపు, ఎల్లుండి అని దాట వేశారు. ఇప్పుడు వాళ్ల ఇంటర్నషిప్ కూడా పూర్తయిపోయింది. మరి మా స్టైఫండ్ సంగతి ఏమిటని ప్రశ్నిస్తే… ఇవ్వలేమంటూ చేతులెత్తేశారు అధికారులు. ఇంతకీ ఆదిలాబాద్ రిమ్స్‌లో ఏం జరుగుతోంది..? తెలంగాణలో ఎక్కడా లేని పరిస్థితి ఇక్కడే ఎందుకు ఎదురవుతోంది..? ఆదిలాబాద్ రిమ్స్‌లో జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ అంశం మళ్లీ మొదటికొచ్చింది. ఇంత కాలం ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేసిన…
సాగు సమస్యలు పరిష్కారం కాక … అష్ట కష్టాలు పడి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక ఈ ఖరీఫ్ లో క్రాప్ హాలీడే పాటిస్తే కనీసం పెట్టుబడి డబ్బులు అయినా మిగులుతాయని కోనసీమ వరి రైతులు పంట విరామానికే మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే కోనసీమ జిల్లాలోని ఐ.పోలవరం, అల్లవరం మండలాల రైతులు గ్రామాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసుకుని క్రాప్ హాలీడే పాటించాలని నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని 12 మండలాల్లోని రైతులు ప్రస్తుత ఖరీఫ్ సీజన్…
కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ మధ్య పూర్తి సామరస్యం, సరైన అవగాహన ఉందన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. క్రిప్టో కరెన్సీ సహా అన్ని అంశాలపై కేంద్రం, RBI ఒకే మాటపై ఉన్నాయని చెప్పారు. ఒక వ్యవస్థ పట్ల మరో వ్యవస్థకు పరస్పర నమ్మకముందన్నారు నిర్మల. జాతీయ ప్రయోజనాలు, ప్రాధాన్యాలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నామన్నారు. రిజర్వ్ బ్యాంక్ బోర్డ్ మీటింగ్ తర్వాత గవర్నర్ శక్తికాంత దాస్ తో కలసి మీడియా ముందుకొచ్చిన నిర్మల… ప్రతీ విషయంలోనూ……
కరోనా నుంచి బయటపడాలి అంటే తప్పని సరిగా వ్యాక్సిన్ తీసుకోవాలి. వ్యాక్సిన్ తీసుకోవడం ఒక్కటే మార్గం కావడంతో వేగంగా వ్యాక్సినేషన్‌ను అమలు చేస్తున్నారు. ప్రపంచం మొత్తం కరోనాను ఎదుర్కొంటున్న సమయంలో కరోనాను పూర్తిగా దేశం నుంచి తరిమికొట్టి జీరో కరోనా దేశంగా గుర్తింపు పొందింది న్యూజిలాండ్. అయితే, ఇటీవలే అక్లాండ్‌లో డెల్టా కేసు ఒకటి బయటపడటంతో వెంటనే దేశంలో మూడు రోజులపాటు లాక్‌డౌన్ విధించారు. కాగా, ఇప్పుడు ఇదే విధమైన మరో కఠిన నిర్ణయం తీసుకున్నది న్యూజిలాండ్…
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నా, మహారాష్ట్రలో మాత్రం కేసులు తగ్గడంలేదు. మహారాష్ట్రలోని 8 జిల్లాల్లో కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కొల్హాపురి, సాతారా, పాల్ఘాట్, రాయ్‌గడ్, సంధూదుర్గ్, రత్నగిరి, పూణే రూరల్, సాంగ్లీ జిల్లాల్లో కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తొంది. కరోనా కేసులతో పాటుగా అటు మరణాల సంఖ్య కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి. ఆదివారం రోజున 8,535 కేసులు నమోదవ్వగా 158 మరణాలు నమోదయ్యాయి. 8 జిల్లాల నుంచే అధికంగా కేసులు వస్తుండటంతో ప్రభుత్వ యంత్రాంగం…