తెలంగాణ ప్రభుత్వం మరోసారి ఐపీఎస్ లను బదిలీ చేసింది. 20 మంది ఐపీఎస్ లు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. డీజీపీగా రవిగుప్తాను కొనసాగించింది. రోడ్‌సేఫ్టీ డీజీగా అంజనీకుమార్.. ఏసీబీ డీజీగా సీవీ ఆనంద్.. రైల్వే డీజీగా మహేష్ భగవత్.. సీఐడీ చీఫ్‌గా శిఖాగోయల్.. జైళ్లశాఖ డీజీగా సౌమ్యామిశ్రా.. ఎస్‌ఐబీ చీఫ్‌గా సుమతి.. సీఐడీ డీఐజీగా రమేష్‌నాయుడు.. సెంట్రల్‌జోన్ డీసీపీగా శరత్‌చంద్ర.. కార్ హెడ్‌క్వార్టర్స్ జాయింట్ సీపీగా సత్యనారాయణకు బాధ్యతలు అప్పగించింది.
Samsung users to update their smartphones: మీరు ‘శాంసంగ్’ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా?.. అయితే మీకు కేంద్ర ప్రభుత్వం ఓ అలర్ట్ జారీ చేసింది. శాంసంగ్ కంపెనీకి సంబంధించిన స్మార్ట్‌ఫోన్‌లో సెక్యూరిటీ లోపాన్ని గుర్తించామని, వెంటనే తమ ఫోన్లను అప్‌డేట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్చరించింది. ఆండ్రాయిడ్ 11, 12, 13, 14 ఓఎస్‌తో పనిచేసే శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌లో భద్రతాపరమైన లోపం ఉందని, వ్యక్తిగత డేటాను హ్యాకర్లు దొంగిలించే ప్రమాదం ఉందని పేర్కొంది.…
తెలంగాణ బీసీ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. బీసీలకు ఉన్నత విద్యనందించాలన్న లక్ష్యంతో మన దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో చదివే వారికి రాష్ట్ర ప్రభుత్వం ఫీజు చెల్లిస్తుందని తెలిపింది. 2023-24 విద్యా సంవత్సరం నుంచే ఫీజు రీయంబర్స్‌మెంట్ అమలు చేయాలని బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంను మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు.
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జనాలు ఇప్పుడు సగం ధరకే టమోటాలు పొందనున్నారు. వారికి మొబైల్ వ్యాన్‌ల ద్వారా ఈ సదుపాయం అందించింది అక్కడి ప్రభుత్వం. లక్నో మేయర్ సుష్మా ఖార్క్వాల్ అధ్యక్షతన ఈ కార్యక్రమం ప్రారంభమైంది. భారత ప్రభుత్వ సహకారంతో నేషనల్ కన్స్యూమర్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌సిసిఎఫ్‌ఐ) ద్వారా.. లక్నోలోని 11 చోట్ల టమాటోలను మొబైల్ వ్యాన్‌లలో కిలో రూ.80కి ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే హెచ్ఆర్ఏ పెరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మార్చిలోనే డీఏను పెంచడంతో అందుకు అనుగుణంగా హెచ్ఆర్ఏ పెరగనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్ఆర్ఏ చివరిసారిగా 2021 జూలైలో పెరిగింది. అప్పుడు డీఏ తొలిసారి 25 శాతం దాటి 28 శాతానికి పెరిగింది.
లంగాణ ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ పెంచుతున్నట్లు తెలిపింది. కనీస వేతనం, పెన్షన్‌పై 2.73 శాతం డీఏ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
బీటెక్ విద్యార్థులకు ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. బెల్ లో పలు శాఖల్లో ఉద్యోగాల కు సంబందించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 205 పోస్టులను భర్తీ చేయనున్నారు. విభాగాల వారీగా చూస్తే.. ప్రాజెక్ట్ ఇంజనీర్ – I మరియు ట్రైనీ ఇంజనీర్ – I పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది బెల్. ఈ పోస్టులకు…