ప్రభుత్వ వైఖరికి నిరసనగా రేపు ఇంటర్ విద్యాసంస్థల బంద్ కు పిలుపునిస్తున్నామని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఇంటర్ విద్యలో కార్పొరేట్ కళాశాలలను ప్రభుత్వ నియంత్రించడం లేదంటూ కార్పొరేట్ విద్యాసంస్థల ముందు ఏబీవీపీ ఆందోళనకు పిలుపునిచ్చింది. నారాయణగూడ లోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాల ముందు ఏబీవీపీ నాయకులు ధర్నా చేపట్టారు. కార్పొరేట్ విద్యాసంస్థలపై ఇంటర్ బోర్డ్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని మండిపడ్డారు.
ఒకే పేరుతో వందల బ్రాంచ్ లు నిర్వహిస్తున్న నారాయణ, శ్రీ చైతన్య సహా ఇతర కార్పొరేట్ కళాశాలలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంగిస్తున్న,అనుమతి లేని కళాశాలపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంగించి ర్యాంక్ లను ప్రచారం చేస్తున్న కళాశాలల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అధిక ఫీజులను నియంత్రించి ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటర్ విద్యలో కార్పొరేట్ విద్యాసంస్థల ఆగడాలు, ఆత్మహత్య లపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని పేర్కొన్నారు. కార్పొరేటర్ విద్యాసంస్థలను నియంత్రించడంలో విఫలపైన ప్రభుత్వ వైఖరికి నిరసనగా రేపు ఇంటర్ విద్యాసంస్థల బంద్ కు పిలుపు నిచ్చారు.
అయితే.. ఆగస్టు 20న హైదరాబాద్ రామాంతపూర్ నారాయణ కాలేజీలో టీసీ కోసం విద్యార్థి నిప్పంటించుకున్న ఘటన నేపథ్యంలో ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.. విద్యార్థుల సర్టిఫికెట్లు ఏ కారణంతోనూ ఆపొద్దంటూ కాలేజీలను ఆదేశించిన బోర్డు.. కోర్సు పూర్తైన వారికి సర్టిఫికెట్లు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. విద్యార్థులకు కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వకపోతే డీఐఈవో లేదా ఇంటర్ బోర్డుకు ఫిర్యాదు చేయాలని సూచించిన విషయం తెలిసిందే. అయితే రేపు విద్యాసంస్థల బంద్ ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటుందో వేచి చూడాలి.
Home Work: ఒకటీ రెండు తరగతుల విద్యార్థులకు హోం వర్క్ ఇవ్వొద్దన్న ఆదేశాలు అమలవుతాయా?