గవర్నర్‌గా మాజీ సీఎం యడియూరప్ప..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజీనామా వ్యవహారంపై వస్తున్న వార్తలను ఖండిస్తూనే వచ్చిన కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప.. చివరకు రాజీనామా చేశారు.. గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ను కలిసిన ఆయన రాజీనామా పత్రాన్ని అందజేశారు. అయితే, కొత్త సీఎంను ఎన్నుకునే వరకు ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని యడియూరప్పను కోరారు గవర్నర్.. ఇక, యడియూరప్ప వారసుడు ఎవరు? కర్ణాటక సీఎం పీఠంపై కూర్చోబోతున్న కొత్త వ్యక్తి ఎవరు అనేదానిపై బీజేపీ అధిష్టానం తీవ్రమైన కసరత్తు చేస్తోంది.. ఇదే సమయంలో.. యడియూరప్పకు బీజేపీ అధిష్టానం గవర్నర్ పదవి ఆశచూపినట్టు కూడా ప్రచారం సాగుతోంది.. ఏపీ లేదా మరో రాష్ట్రానికి గవర్నర్ గా యడియూరప్పను నియమించే అవకాశాలు ఉన్నాయని సమాచారం..
ఇప్పటికే కేంద్ర కేబినెట్ నుంచి తప్పించి మరీ గవర్నర్ నియమించిన ఘటనలు ఉన్నాయి.. వివిధ రాష్ట్రాల్లోనూ పార్టీ సీనియర్లకు కూడా గవర్నర్లను చేసింది బీజేపీ అధిష్టానం.. అదే కోవలో.. యడియూరప్పను కూడా గవర్నర్‌గా పంపే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.. అయితే, దీనిపై స్పందించిన యడియూరప్ప.. తాను ఎక్కడికీ వెళ్లనని, రాష్ట్రంలోనే ఉంటానని స్పష్టం చేశారు. మరోవైపు.. తన రాజీనామాపై హైకమాండ్ నుంచి ఎలాంటి ఒత్తిడీ లేదని కూడా చెప్పుకొచ్చారు.. తాను ఎలాంటి పదవులూ కోరుకోవడం లేదని, గవర్నర్ గా వెళ్లడం ఇష్టం లేదని తెలిపారు.. మరీ ఈ కర్ణాటక ఎపిసోడ్‌కు ఎప్పుడు తెరపడుతుంది.. యడియూరప్పను ఎలాంటి పదవి వరించబోతోంది? అనేది వేచిచూడాలి.
Also Read
- Sergio Gor: గత వారం మోడీ-ట్రంప్ మాట్లాడుకున్నారు.. ఏం జరుగుతుందో చూద్దామన్న సెర్గియా గోర్
- Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
తాజావార్తలు
-
Papikondalu Boating: 70 రోజుల విరామం.. నేటి నుంచి పాపికొండలు విహారయాత్ర!
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
-
AP Weather Update: ఏపీకి 4 రోజుల పాటు వర్ష సూచన!
-
New Mobile Launched: ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా.. ఈ కొత్త ఫోన్‌తో పరిష్కారం దొరికినట్లే..
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!