Governor Abdul Nazeer: బంగారు పథకాలు వచ్చిన వారిలో 80 శాతం మంది బాలికలు ఉన్నారు.. ఇది బాలురకు హెచ్చరిక కూడా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్.. కర్నూలు జిల్లాలో పర్యటించిన ఆయన.. రాయలసీమ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు.. స్నాతకోత్సవంలో విద్యార్థులకు బంగారు పథకాలు అందచేసిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్.. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. బంగారు పథకాలు వచ్చిన వారిలో 80 శాతం బాలికలు వున్నారు.. ఇది బాలురకు హెచ్చరిక…
కడప జిల్లాలో రెండు జడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతోన్న వేళ.. దాడులు వ్యవహారం కాకరేపుతోంది.. అయితే, రాజ్ భవన్‌లో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసిన వైసీపీ నేతల బృందం.. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వైసీపీ నేతలపై జరుగుతున్న దాడులపై గవర్నర్ కి ఫిర్యాదు చేశారు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. సుమారు గంటన్నర పాటు గవర్నర్‌తో సీఎం సమావేశం అయ్యారు. కూటమి ఏడాది పాలనపై చర్చ జరిగింది. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంపై వివరాలను గవర్నర్‌కు సీఎం చంద్రబాబు వివరించారు. బనకచర్ల ప్రాజెక్ట్, సీఎం ఢిల్లీ టూర్‌పై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. వైసీపీ నేతల వ్యవహార శైలి, తాజా పరిణామాలను గవర్నర్ దృష్టికి సీఎం తీసుకు వెళ్లారు. త్వరలో సీఎం చంద్రబాబు…
ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగ విరమణ చట్ట సవరణకు ఆమోదం తెలిపారు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్.. ఏపీలో న్యాయాధికారుల ఉద్యోగ విరమణ వయసు చట్ట సవరణకు ఆమోద ముద్ర వేశారు.. దీంతో, న్యాయాధికారుల ఉద్యోగ విరమణను 61 ఏళ్లకు పెంచుతూ చేసిన చట్ట సవరణకు ఆమోదముద్ర పడింది.. ఈ మేరకు సవరించిన చట్టాన్ని గెజిట్‌లో ప్రచురించాలని న్యాయశాఖ ఆదేశాలు జారీ చేసింది..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వరి దంపతులు రాజ్‌భవన్‌కు వెళ్లారు.. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ దంపతులను రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక, రాష్ట్రానికి కుటుంబ సమేతంగా వచ్చిన మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గౌరవార్థం ఈ మర్యాదపూర్వక భేటీ జరిగింది. డిన్నర్ చేస్తూ రాష్ట్ర పరిస్ధితులపై గవర్నర్, మాజీ రాష్ట్రపతిలతో చర్చించారు సీఎం చంద్రబాబు..
AP Governor: నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తూ.. ఆంధ్ర ప్రదేశ్ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది.
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు లేఖ రాశారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.. ఈ రోజు సాయంత్రం.. కాపు రామచంద్రారెడ్డి, సాధినేని యామిని శర్మ, బిట్ర శివన్నారాయణ, పాతూరి నాగభూషణం తదితర నేతలతో రాజ్‌భవన్ వెళ్లిన ఆమె.. గవర్నర్‌ను కలిసి.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వివరాలు ప్రకటించాలని కోరుతూ గవర్నర్‌కు లేఖ అందించారు..
రాష్ట్రంలో పోలింగ్ అనంతరం చెలరేగిన హింసపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు.. వైసీపీ నేతలు, మంత్రులు.. ఈ బృందంలో మంత్రి బొత్స సత్యనారాయణ, మేరుగు నాగార్జున, మాజీ మంత్రి పేర్ని నాని, మోపిదేవి వెంకటరమణ , కావటి మనోహర్ నాయుడు తదితరులున్నారు.. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తర్వాత చోటు చేసుకున్న అల్లర్లు, దాడులు వెనుక ఉన్న బాధ్యులపై తగిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని గవర్నర్ ను కోరారు వైసీపీ నేతలు