ఏపీ గవర్నర్‌కు లేఖ రాశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. రాష్ట్ర ప్రభుత్వ ఈ -ఆఫీస్ అప్ గ్రేడ్ వ్యవహారం నిలిపేయాలని గవర్నర్‌ను లేఖ ద్వారా కోరారు చంద్రబాబు.. ఈ నెల 17 నుంచి 25వ తేదీ వరకు అప్ గ్రేడ్ పేరుతో ఈ ఆఫీస్ మూసివేతపై అనుమానాలు వ్యక్తం చేశారు చంద్రబాబు.. మరికొద్ది రోజుల్లో కొత్త ప్రభుత్వం వస్తున్న తరుణంలో ఇప్పటికిప్పుడు ఈ ఆఫీస్ అప్ గ్రేడియేషన్ అవసరం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఆయన..…
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తోంది. అందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గణతంత్ర వేడుకల్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ జెండా వందనం చేయనున్నారు. ముఖ్యమంత్రి జగన్ కూడా ఈ వేడుకల్లో పాల్గొననున్నారు.
ప్రభుత్వానికి, పార్టీకి మధ్య తేడా ఉంది.. నన్ను ఓ పార్టీ ఏజెంట్ అనడం తప్పు అన్నారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ మాజీ ఎన్నికల కమిషనర్, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్..
నేడు తిరుపతిలో గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్.. శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ వర్సిటీ 12వ స్నాతకోత్సవంకు హాజరుకానున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల గవర్నర్ అబ్దుల్ నజీర్ అనంతపురం పర్యటనలో భాగంగా.. ఎస్కే యూనివర్సిటీ 21వ స్నాతకోత్సవంలో గవర్నర్ నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్కే యూనివర్సిటీలో శ్రీ కృష్ణదేవరాయ విగ్రహానికి గవర్నర్ నజీర్ నివాళులు అర్పించారు. breaking news, latest news, telugu news, governor abdul nazeer
AP Budget Session 2023: విశాఖపట్నం నగరాన్ని రాష్ట్ర పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అసెంబ్లీలో ప్రకటించారు రాష్ట్ర గవన్నర్ అబ్దుల్ నజీర్.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. విశాఖపట్నం కేంద్రంగా జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు (జీఐఎస్)లో మొత్తం రూ.13.42 లక్షల కోట్ల పెట్టుబడులకు 378 ఎంవోయూలు కుదుర్చుకున్నట్టు వెల్లడించారు.. 16 కీలక రంగాలలో 6 లక్షల ఉద్యోగాలు సృష్టించబడతాయనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. ఇంధన…