AP Governor: నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తూ.. ఆంధ్ర ప్రదేశ్ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. 2014- 19 మధ్య రాష్ట్ర అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు పడ్డాయి.. 2014-19 మధ్య భారీగా పెట్టుబడులను ఆకర్షించగలిగింది అన్నారు. పోలవరాన్ని 75 శాతానికి పైగా పూర్తి చేశాం.. అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్న సమయంలో 2019లో అధికార మార్పిడి జరిగింది అని గవర్నర్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం కారణంగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది.. వైసీపీ ప్రభుత్వ సమయంలో ప్రజల స్వేచ్ఛను లాగేసుకున్నారు.. గత ప్రభుత్వ హయాంలో పెట్టుబడులు ఆగిపోయాయి, సంస్థలు తరలిపోయాయని తన ప్రసంగంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రస్తావించారు.
Read Also: YSRCP MLAs Black Scarves: నల్ల కండువాలతో అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు.. పోలీసులపై జగన్ ఫైర్..!
ఇక, ప్రాజెక్టులపై మూలధన వ్యయం 56 శాతం తగ్గించారు.. రోడ్లు, భవనాలపై వ్యయం 80 శాతానికి పైగా తగ్గించేశారని గవర్నర్ అబ్దుల్ నజీర్ చెప్పుకొచ్చారు. అమరావతి కలను చెదరగొట్టడానికి డీసెంట్రలైజేషన్ పేరుతో మూడు రాజధానులన్నారు .. గత ఐదేళ్లలో ఏపీలో వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి.. శ్వేతపత్రాలతో ఏపీకి జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరిస్తున్నామన్నారు. రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం ప్రాజెక్టుకు తీవ్రనష్టం చేశారు.. మూడు రాజధానుల పేరుతో ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు.. 2018 నాటికి ఇంధన మిగులు రాష్ట్రంగా ఏపీ మారింది.. 2019-24 మధ్య ఏపీ ఇంధన రంగానికి రూ.1,29,503 కోట్ల నష్టం జరిగింది.. ఇసుక, ఖనిజ సంపదను కొల్లగొట్టడం ద్వారా రూ.19వేల కోట్లనష్టం వచ్చింది.. అస్తవ్యస్త ఇసుక విధానంతో 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారు.. నాణ్యత లేని మద్యం, గుర్తింపులేని బ్రాండ్లు తీసుకొచ్చారు.. రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయానికి భారీ నష్టం తీసుకొచ్చారు.. వైసీపీ ప్రభుత్వం కారణంగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలును ప్రారంభించాం.. సూపర్‌సిక్స్ వాగ్దానాలకు కట్టుబడి ఉన్నాం.. 16,347 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి మెగా డీఎస్సీ ప్రకటించాం.. ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేశాం.. సామాజిక భద్రత పెన్షన్లను రూ.4వేలకు పెంచాం.. రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకుని రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు సహకరించాలి అని గవర్నర్ అబ్దుల్ నజీర్ వెల్లడించారు.