బీసీసీఐ సెక్రటరీ జైషాకు శ్రీలంక ప్రభుత్వం క్షమాపణలు చెప్పింది. శ్రీలంక క్రికెట్‌ను నాశనం చేశాడంటూ జై షాపై.. ఆ దేశ మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఈ విషయంపై శ్రీలంక ప్రభుత్వం స్పందించింది. శ్రీలంక పార్లమెంట్‌లో మంత్రి కాంచన విజేశేఖర మాట్లాడుతూ.. మా ప్రభుత్వం తరపున జై షాకు క్షమాపణలు తెలుపుతున్నట్లు చెప్పారు.
దేశ వ్యాప్తంగా ద్రవ్యోల్బణంతో ఉల్లి ధరలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రజలకు అండగా నిలిచేందుకు చర్యలు చేపట్టింది. ప్రభుత్వ సంస్థలు అనేక నగరాల్లోని ప్రజలకు చౌక ధరలకు ఉల్లిపాయలను అందిస్తున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో నివసించే ప్రజలకు కిలో ఉల్లిని కేవలం 25 రూపాయలకే అందించనుంది.
Telangana: తెలంగాణ పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి సారించిన సర్కార్ దసరా సెలవుల అనంతరం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం రాగు జావ పంపిణీ చేయాలని నిర్ణయించింది.
దేశంలో మురుగు కాల్వల మరణాల ఘటనలను తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు.. మురుగు కాల్వలను శుభ్రం చేసే సమయంలో మరణించిన వారి కుటుంబానికి ప్రభుత్వ అధికారులు రూ.30 లక్షల పరిహారం చెల్లించాలని పేర్కొంది.
Chittoor: పిల్లలు ఆరోగ్యానికి పౌష్ఠిక ఆహారం చాల అవసరం. ఎందుకంటే పిల్లల ఎదుగుదలలో పౌష్ఠిక ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. పౌష్టికాహార లోపం ఉన్న పిల్లల్లో సరైన ఎదుగుదల ఉండదు. అలానే తల్లి గర్భంలో ఉన్న శిశువుకు కూడా పౌష్ఠిక ఆహారం అందించాలి. అప్పుడే పుట్టే బిడ్డ ఆరోగ్యంగా పుడుతుంది. అందుకే ప్రభుత్వం శిశు సంరక్షణ పథకం కింద అంగనవాడి కేంద్రాలకు పౌష్టికాహారాన్ని పంపిణి చేస్తుంది. అయితే ప్రభుత్వం పంపిణి చేసే పౌష్ఠిక ఆహారంలో నాణ్యత ఉంటుందా?…
ప్రభుత్వ ఉద్యోగులకు 5 శాతం పీఆర్సీ పెంచడం దారుణమని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఎంప్లాయ్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటే ఇదేనా అని ప్రశ్నించారు. ఇదేనా ఉద్యోగులను కడుపులో పెట్టుకునే చూసుకునే విధానమని విమర్శించారు. దేశంలోనే ధనిక రాష్ట్రంలో ఏమిటి దారుణమని ప్రశ్నించారు. వెంటనే 20% ఐఆర్ ప్రకటించాలన్నారు.
హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై భాగ్యనగర్ ఉత్సవ సమితి, వీహెచ్పీ ఆందోళన చేపట్టారు. వినాయక నిమజ్జనం ఈ ఏడాది హుస్సేన్ సాగర్ లో నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు హైకోర్టు అనుమతి ఇచ్చేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని తెలిపారు.
అసెంబ్లీ సమావేశాలు రెండో రోజులో భాగంగా సభలో ప్రభుత్వం మూడు బిల్లులను ప్రవేశ పెట్టనుంది. స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ బిల్లు- 2023, ఏపీ వైద్య విధాన పరిషత్ రిపీల్ (రద్దు) బిల్లు -2023, ఏపీ ఆధార్ బిల్లు -2023ను ప్రవేశపెట్టనుంది.
Google: ప్రస్తుత ఇంటర్నెట్ ప్రపంచంలో మనం ఏదైనా సెర్చ్ చేయాల్సి వస్తే గూగుల్ లో మాత్రమే సెర్చ్ చేస్తున్నాం. మార్కెట్‌లో ఈ ఆధిపత్యాన్ని కొనసాగించడానికి గూగుల్ ప్రతి సంవత్సరం 10 బిలియన్ డాలర్లు అంటే రూ. 83,000 కోట్లు ఖర్చు చేస్తుంది.
Kerala Nipah Update: కేరళలో నిపా వైరస్ కలకలం రేపుతోంది. బుధవారం మరో నిపా కేసు వెలుగులోకి వచ్చింది. రోజు రోజుకు రాష్ట్ర ఆరోగ్య శాఖలో ఆందోళన మొదలైంది. దీంతో రాష్ట్రంలో మొత్తం నిపా బాధితుల సంఖ్య ఐదుకు చేరింది.