వైసీపీ ప్రభుత్వంపై జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెనాలిలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల నుండి 3,82,000 మంది విద్యార్థులు డ్రాప్ ఔట్ అయ్యారని తెలిపారు. విద్యార్థుల అంశంలో ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని.. దీనికి కారణాలు ప్రభుత్వం ప్రజలకు చెప్పాలని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం టీచర్ల బదిలీలు, ప్రమోషన్లపై జనవరిలో షెడ్యూల్ ప్రకటించింది. కానీ ఫిబ్రవరిలో దీనిపై హైకోర్టు స్టే విధించింది. దీంతో అప్పటి నుంచి కోర్టులో వాదనలు కొనసాగుతూనే వున్నాయి. అయితే తాజాగా బుధవారం బదిలీలపై విధించిన స్టే ను ఎత్తివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యం లో త్వరలోనే ఎన్నికలు ఉండటంతో బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియను స్పీడప్ చేసేందుకు విద్యా శాఖ సిద్ధం అవుతుంది.. అయితే, జనవరిలోనే షెడ్యూల్ ప్రకటించి టీచర్ల నుంచి…
కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది 2024-25 విద్యా సంవత్సరం నుంచి కర్ణాటకలో జాతీయ విద్యా విధానం-2020ని రద్దు చేయనున్నట్టు ప్రకటించింది.
Finance Minister: డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్(డీబీటీ) ద్వారా గత 9 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ.2.73 లక్షల కోట్లు ఆదా చేసిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.