కరోనా మహమ్మారి ఇంకా అతలాకుతలం చేస్తూనే ఉంది.. ఫస్ట్ వేవ్ లో భారీగా కేసులు నమోదు అయ్యి, మృతుల సంఖ్య కూడా పెద్ద సంఖ్యలోనే ఉండగా.. ఇక, సెండ్ వేవ్ గుబులు పుట్టించింది.. కోవిడ్ బారినపడి ఆస్పత్రికి వెళ్లినవారు తిరిగి వస్తారన్న గ్యారెంటీ లేని పరిస్థితి.. రోజుకో రికార్డు సంఖ్యలో కేసులు వెలుగు చూస్తే.. మృతుల సంఖ్య కూడా భారీగా నమోదవుతూ కలవరం పుట్టించింది.. ఇక, థర్డ్ వే హెచ్చరికలు భయపెడుతోంది.. ఇప్పటి వరకు ఆ మహమ్మారితో…
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు ఎప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. అయితే, వ్యాక్సిన్ తీసుకుంటే.. ఏదో జరిగిపోతోందని.. చనిపోతున్నారని.. ఆస్పత్రి పాలవుతున్నారనే అనేక పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి.. మరోవైపు.. వ్యాక్సినేషన్ తయారీ విధానంపై కూడా ఆరోపణలు, విమర్శలు వస్తూనే ఉన్నాయి.. తాజాగా, హైదరాబాద్ కేంద్రంగా వ్యాక్సిన్లు తయారు చేస్తున్న భారత్ బయోటెక్ పై కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి.. కోవాగ్జిన్ వ్యాక్సిన్ లో అప్పుడే పుట్టిన లేగదూడ పిల్లల ద్రవాలను వినియోగిస్తున్నట్లు సోషల్ మీడియా…
కరోనా మహమ్మారిని కట్టడి చేయడం కోసం దేవశ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం రోజురోజుకూ వేగం పుంజుకుంటుంది.. అయితే, కరోనా ఫస్ట్ డోస్.. సెకండ్ డోస్‌కు మధ్య ఉండాల్సిన గ్యాప్‌పై రకరకాల కథనాలు వస్తున్నాయి.. వైద్య నిపుణులకు కూడా ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నాయి.. ఈ సమయంలో.. కొందరికి ఆందోళనకు కూడా కలుగుతోంది.. దీంతో.. కరోనా డోసుల మధ్య నిడివి గురించి క్లారిటీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం.. రెండు డోసుల మధ్య గ్యాప్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని…
రైతులకు తెలంగాణ శుభవార్త చెప్పింది. ఈ వానాకాలం సాగుకు వచ్చే నెల 15 నుంచి రైతుబంధు సాయం రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. జూన్ 25 లోపు రైతుల ఖాతాల్లో నగదు జమను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. పార్ట్-బీ నుంచి పార్టీ-ఏ జాబితాలో చేర్చిన భూములకు సైతం ఈసారి రైతుబంధు సాయం వర్తింపజేయనున్నట్లు తెలిపారు. జూన్ 10ని కట్టాఫ్ తేదీగా నిర్ణయించి రైతుబంధు వర్తింపజేయనున్నట్లు వెల్లడించారు. రైతుబంధు నిధుల విషయంలో…
భారత ప్రభుత్వం.. సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ మధ్య ఇప్పటికే వారు నడుస్తోంది.. తాజాగా, ఆ సంస్థ వ్యవహార శైలి మరోసారి భారత్‌కు కోపం తెప్పించింది.. దీంతో ఫైనల్ వార్నింగ్ ఇచ్చింది.. కొత్త ఐటీ నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిందేనని.. లేదంటే చట్టపరమైన పర్యవసానాలను ఎదుర్కోకతప్పదని హెచ్చరించింది ఐటీ మంత్రిత్వ శాఖ ప్యానెల్…ట్విట్టర్ వ్యవహారంపై సీనియర్ అధికారులతో కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.. ఆ తర్వాత నోటీసులు…
తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ ఇచ్చిన నివేదికపై న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది.. తాము ఇచ్చిన ఆదేశాలు పాటించలేదన్న కోర్టు.. కోవిడ్ చికిత్సల ధరలపై కొత్త జీవో ఇవ్వలేదని మండిపడింది.. తాము అడిగిన ఏ ఒక్క అంశానికి నివేదికలో సరైన సమాధానంలేదని వ్యాఖ్యానించింది.. ఇక, రేపు జరిగే విచారణకు.. హెల్త్ సెక్రటరీ, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, డీజీపీ.. అందరూ హాజరుకావాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది.. మహారాష్ట్రలో 8 వేల…
కరోనాకు చెక్ పెట్టేందుకు ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. అయితే, భారత్‌లో వ్యాక్సినేషన్‌పై గందరగోళం కొనసాగుతూనే ఉంది.. దీనికి కారణం.. రాష్ట్రాల దగ్గర సరైన వ్యాక్సిన్ నిల్వలు లేకపోవడమే కారణం.. దీంతో.. క్రమంగా కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నాయి రాష్ట్రాలు.. వ్యాక్సిన్ల విషయంలో కేంద్రం పాలసీని తప్పుబడుతున్నారు. అయితే, ఇప్పటి వరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 22,77,62,450 వ్యాక్సిన్ డోసులు సరఫరా చేసినట్టు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ప్రకటించింది.. ఇవాళ ఉదయం 8 గంటల వరకు తమ దగ్గర…
కరోనా మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పో్యి అనాథలుగా మారిన చిన్నారులను ఆదుకోవడానికి ప్రత్యేక చర్యలు చేపట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వారి పేర్లతో రూ.10 లక్షల చొప్పున ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని నిర్ణయం తీసుకుంది.. ఇక, అందులో భాగంగా.. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులు మరణించి అనాథలైన చిన్నారులను ఇప్పటి వరకు 78 మందిని గుర్తించారు అధికారులు.. వారిలో ఇప్పటికే 10 మంది పేర్లపై రూ.10 లక్షల చొప్పున డిపాజిట్ కూడా చేశారు.. ఇవాళ కరోనా పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన…
కొత్త నిబంధనలు ఇప్పుడు భారత ప్రభుత్వం, ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ మధ్య వివాదానికి దారి తీశాయి.. ఇక, భావ ప్రకటనా స్వేచ్ఛకు ప్రమాదం వుందన్నట్విట్టర్ చేసిన వ్యాఖ్యలను మరింత దుమారాన్నే రేపుతున్నాయి.. దీనిపై కేంద్ర ఐటీశాఖ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.. ట్విట్టర్ వ్యాఖ్యలను ఖండించిన కేంద్రం.. ఇది, ట్విట్టర్ బెదిరింపు వ్యూహాలతో కూడిన నిరాధార ఆరోపణలుగా ఐటీ శాఖ వ్యాఖ్యానించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి.. ఇప్పుడు ట్విట్టర్ పాఠాలు నేర్పుతోందని ఫైర్ అయ్యింది…
మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడినవారికి కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్‌కు అనుమతి ఇచ్చినా.. చాలా రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో నామమాత్రంగానే జరిగింది.. దీనికి వ్యాక్సిన్ల కొరతే ప్రధాన కారణంగా ప్రకటించింది సర్కార్.. అయితే, త్వరలోనే 18 ఏళ్లు పైబడినవారికి కూడా రాష్ట్రంలో వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం కానుంది.. 10 రోజులు దాటిన తర్వాత ఇవాళ్టి నుంచి రెండో డోసును ప్రారంభించింది ప్రభుత్వం.. ఇక, 18 ఏళ్లు పైబడిన వ్యక్తులకు కొవిడ్ టీకాలు వేసేందుకు అన్ని…