దేశవ్యాప్తంగా విద్యుత్‌కు భారీగా డిమాండ్ పెరిగిన తరుణంలో.. బొగ్గు తవ్వకాలను పెంచే దిశగా కేంద్రం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా మంగళవారం దేశవ్యాప్తంగా 88 బ్లాకుల వేలంపై ప్రకటన విడుదల చేసింది. కోల్‌మైన్స్ స్పెషల్ ప్రొవిజన్స్ యాక్టు-2015, మైన్స్, మినరల్స్ యాక్టు-1957 ప్రకారం వేలం వేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఝార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, బెంగాల్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, అస్సాం రాష్ట్రాల్లోని బ్లాకులతో పాటు తెలంగాణకు చెందిన నాలుగు గనులు వీటిలో ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం…
రూ.18 వేల కోట్ల ఓపెన్ బిడ్‌తో ఎయిరిండియాను సొంతం చేసుకుంది టాటా సన్స్.. దీంతో 68 ఏళ్ల తర్వాత తిరిగి ఎయిరిండియా.. టాటాల చేతిలోకి వెళ్లినట్టు అయ్యింది.. డిసెంబర్ నుంచి టాటాల చేతిలోకి వెళ్లిపోనుంది ఎయిరిండియా.. అయితే, టాటాల చేతికి సంస్థ వెళ్లిపోతుండడంతో.. అసలు ఎయిరిండియాలో పనిచేస్తున్న ఉద్యోగుల పరిస్థితి ఏంటి? అనే ఆందోళన ఉద్యోగుల్లో మొదలైంది.. దీనిపై క్లారిటీ కూడా ఇచ్చారు.. ఏఐలో పని చేస్తున్న ఉద్యోగులను ఏడాది పాటు అలాగే కొనసాగించనుంది టాటా గ్రూప్..…
కరోనా మహమ్మారి కేసులు ఇంకా పెద్ద సంఖ్యలోనే వెలుగు చూస్తున్నాయి.. ఫస్ట్ వేవ్ కంటే.. సెకండ్ వేవ్‌లో పెద్ద సంఖ్యలో కేసులు నమోదు అవ్వడమే కాదు.. మృతుల సంఖ్య కూడా పెరిగిపోయింది.. అయితే, దీనికి కారణం.. ఫస్ట్ వేవ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టిన తర్వాత.. ప్రజలు లైట్‌గా తీసుకోవడమే కారణం అని పలు సందర్భాల్లో నిపుణులు చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు సెకండ్ వేవ్ కేసులు తగ్గుతూ వస్తున్నా.. ఇంకా భారీగానే కేసులు నమోదు అవుతున్నాయి.. ఈ…
తాలిబన్ల ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్‌లో కొలువుదీరింది. సమ్మిళిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, అందరిని సమానంగా గౌరవిస్తామని తాలిబన్లు ప్రకటించారు. అయితే, ప్రభుత్వం ఏర్పాటు విషయంలో తాలిబన్లు చెప్పింది ఒకటి చేసింది ఒకటిగా మారింది. తాలిబన్ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు చోటు కల్పిస్తామని చెప్పారు. అన్ని వర్గాలకు అంటే ఉగ్రవాదులు, కిడ్నాపులు చేసిన వారు, హత్యలు చేసినవారు అని అర్ధం కాబోలు. అందుకే ఆ ప్రభుత్వంలో తాలిబన్ ఫైవ్‌కు చోటు కల్పించింది. ఉగ్రవాద నేర చరిత కలిగిన అబ్దుల్ హక్…
కరోనా మహమ్మారికి వ్యాక్సిన్‌తో చెక్ పెట్టే ప్రక్రియ కొనసాగుతోంది.. సాధ్యమైనంత త్వరగా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్న ప్రణాళికలతో ముందుకు వెళ్తోన్న ప్రభుత్వం.. వ్యాక్సిన్ల కొరతకు తీర్చేందుకు స్వదేశీ వ్యాక్సిన్లకు తోడు విదేశీ వ్యాక్సిన్లకు కూడా అనుమతి ఇస్తూ వస్తోంది.. ఇక, ఈ నేపథ్యంలో కరోనా బారిన పడి కోలుకున్న వాళ్లకు ఐసీఎంఆర్ అధ్యయనం ఓ గుడ్‌న్యూస్ చెప్పింది.. ఇప్పటికే కోవిడ్ సోకినవాళ్లు కోవాగ్జిన్.. వ్యాక్సిన్ ఒక్క డోసు తీసుకున్నా చాలని చెబుతోంది ఐసీఎంఆర్.. కోవిడ్ సోకని వాళ్లు…
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను కుదిపేస్తున్న అంశం పెగాసస్… ఉభయసభల్లోనూ ఇదే వ్యవహారం రభస సృష్టిస్తోంది… పెగాసస్ వ్యవహారంపై ప్రభుత్వం చర్చించాల్సిందేనంటూ 9 రోజులుగా ప్రతిపక్షాలు ఉభయ సభలనూ స్తంభింపజేస్తున్నాయి. అలాగే 50 పని గంటల్లో 40 పనిగంటలను సభ కోల్పోయిందని అధికారికంగా ప్రకటించారు. పార్లమెంట్ సమావేశాలకు జరిగిన అవాంతరాల వల్ల 133 కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.. అయితే, ప్రతిష్ఠంభన తొలగిపోయేందుకు ఏమాత్రం సూచనలు కూడా కనిపించడంలేదు.. పెగసస్ వివాదం కారణంగా,…
శబరిమలలోని అయ్యప్ప ఆలయం తెరుచుకుంది.. మలయాళ నెల కర్కిదకమ్ మాసపూజ సందర్భంగా ఆలయాన్ని తెరిచారు పూజారులు.. ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.. ఈ ప్రత్యేక పూజలకు భక్తులకు అనుమతి ఇచ్చినా.. కొన్ని షరతులు విధించారు.. నిన్న సాయంత్రం ఆలయాన్ని తెరిచిన పూజారులు.. ఇవాళ ఉదయం నుంచి భక్తులను అనుమతి ఇస్తున్నారు.. కరోనా భయాలు వెంటాడుతుండడంతో.. ముందుగానే బుక్ చేసుకున్న 5 వేల మంది భక్తులను మాత్రమే అనుమతిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.. కరోనా సెకండ్ వేవ్…
కరోనాకు చెక్‌పెట్టేందుకు ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. భారత్‌లో వ్యాక్సినేషన్‌ను మరింత విస్తృతం చేసేందుకు విదేశీ వ్యాక్సిన్లకు సైతం అనుమతులు ఇస్తూ వస్తోంది భారత్.. ఇప్పటికే స్వదేశంలో తయారైన కోవాగ్జిన్, కోవిషీల్డ్ అందుబాటులో ఉండగా.. రష్యా తయారు చేసిన స్పూత్నిక్ వీకు కూడా గ్రీన్ సిగ్నల్ రాగా.. తాజాగా.. అమెరికా కంపెనీ మోడెర్నా తయారు చేసిన వ్యాక్సిన్ దిగుమతితో పాటు అత్యవసర వినియోగానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి ఇచ్చింది.. మోడెర్నా వ్యాక్సిన్‌ను…
ఓవైపు కరోనా మహమ్మారి.. మరో వైపు లాక్డౌన్లు, కర్ఫ్యూల నేపథ్యంలో.. వాహనదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది కేంద్రం.. డ్రైవింగ్ లైసెన్స్(డీఎల్), రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్(ఆర్సీ) వంటి డాక్యుమెంట్ల వ్యాలిడిటీని పొడిగించింది.. గత ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నాటికి ముగిసిన అన్ని వాహన పత్రాల గడువును గతంలో ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించిన కేంద్రం.. ఇవాళ వ్యాలిడిటీని ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు రోడ్డు మరియు రవాణా, రహదారుల…