టాలీవుడ్ సీనియర్ ఎడిటర్ గౌతమ్ రాజు అనారోగ్య కారణాలతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. తెలుగు సహా వివిధ భాషల్లో సుమారు 800 పైగా సినిమాలకు పని చేసిన ఆయన సినిమా కోసమే పుట్టారేమో అంటూ తెలుగు పరిశ్రమలో వారు అంటూ ఉంటారు. గత కొద్ది రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన అనారోగ్య కారణాలతో కొన్నాళ్ల క్రితమే హాస్పిటల్లో చేరారు. కొన్నిరోజులు క్రితమే డిస్చార్జ్ అయ్యారు. అయితే అనూహ్యంగా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బుధవారం…