తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉక్కిరిబిక్కిరి అవుతోంది ద్వీప దేశం శ్రీలంక. కనీసం పెట్రోల్, డిజిల్ కొనేందుకు కూడా విదేశీ మారక నిల్వలు లేని పరిస్థితి. ఇదిలా ఉంటే ప్రస్తుతం శ్రీలంక వద్ద పెట్రోల్ నిల్వలు పూర్తిగా అడుగంటుకుపోయాయి. అయితే గమ్మత్తు ఏంటంటే.. లేని పెట్రోల్ పై కూడా అక్కడి ప్రభుత్వం మళ్లీ ధరలు పెంచింది. మంగళవారం పెట్రోల్ ధర ను 20-24 శాతం, డిజిల్ పై 35-38 శాతం పెంచింది. ఈ విషయాన్ని విద్యుత్, ఇంధన శాఖ…
శ్రీలంక ఆర్థిక కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓ వైపు ఆహార కొరత, నిత్యావసరాల ధరలు పెరుగుతూ పోతుంటే.. మరో వైపు ఇంధన కష్టాలు శ్రీలంకను పట్టిపీడిస్తున్నాయి. దేశంలో చమురు నిల్వలు అడుగంటిపోయాయి. పెట్రోల్, డిజిల్ కోసం జనాలు పెట్రోల్ బంకుల ముందు బారులు తీరుతున్నారు. పెట్రోల్ కోసం ప్రజల మధ్య ఘర్షణ తలెత్తుతోంది. బ్రిటిష్ నుంచి స్వాతంత్య్రం పొందిన 1948 తరువాత శ్రీలంకలో ఎప్పుడూ చూడని విధంగా ఆర్థిక సంక్షోభం నెలకొంది. ఇదిలా ఉంటే శ్రీలంకలో మరోసారి…
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యావసరాల ధరలు పెరగడంతో పాటు పెట్రోల్ దొరక్క.. దొరికినా ధరలు పెరగడంతో ప్రజల్లో ఆసహనం పెరుగుతోంది. ఇప్పటికే దేశ అధ్యక్షుడు గోటబయ రాజపక్స రాజీనామా చేయాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజలు పెద్ద ఎత్తున నిరసన, ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ప్రజల ఆందోళన నేపథ్యంగాలో ప్రధానిగా ఉన్న మహిందా రాజపక్స తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం కొత్త ప్రధానిగా రణిల్ విక్రమసింఘేను నియమించాడు…
తీవ్ర ఆర్థిక, ఆహారం సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది శ్రీలంక. ప్రజలు రోడ్లపైకి వచ్చిన తన నిరసన తెలుపుతున్నారు. ఆందోళనలు చేపడుతున్నారు. ముఖ్యంగా అధ్యక్షడు గొటబయ రాజపక్సను గద్దె దిగాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రజల ఆందోళలతో ప్రధాని పదవికి మహిందా రాజపక్సే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు తీవ్ర పెట్రోల్ కొరతతో శ్రీలంక అల్లాడుతోంది. ఇదిలా ఉంటే తనపై వచ్చిన వ్యతిరేఖతను తొలగించుకునేందుకు అధ్యక్షుడు గోటబయ రాజపక్స ప్రయత్నిస్తున్నారు. దీంట్లో భాగంగానే ఇటీవల ప్రధానిగా రణిల్…
శ్రీలంకలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో గత కొన్ని నెలల నుంచి ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రజలు రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా గురువారం శ్రీలంకలో మరోసారి టెన్షన్ నెలకొంది. అధ్యక్షుడు గోటబయ రాజపక్స రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ప్రజలు, విద్యార్థి సంఘాలు రాజధాని కొలంబోలోని అధ్యక్షుడు ఇంటి ముందు పెద్ద ఎత్తున నిరసన నిర్వహిస్తున్నారు. గోటబయ వెంటనే రాజీనామా…
శ్రీలంక కొత్త ప్రధానిగా రణిల్ విక్రమసింఘే బాధ్యతలు చేపట్టారు. అధ్యక్షుడు గోటబయ రాజపక్సే రణిల్ విక్రమసింఘే చేత ప్రమాణ స్వీకారం చేయించి బాధ్యతలు అప్పగించారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంకను విషమ పరిస్థితుల నుంచి బయటపడేసే బాధ్యత ప్రస్తుతం రణిల్ విక్రమసింఘేపై ఉంది. ఇటీవల శ్రీలంకలో నిరసనలు తీవ్రమై హింసాత్మకంగా మారాయి. దీంతో ప్రధాని పదవిలో ఉన్న మహిందా రాజపక్సే తన పదవికి రాజీనామా చేశారు. దీంతో కొత్త ప్రధాని ఏర్పాటు అనివార్యమైంది. బుధవారం దేశప్రజలను…
తీవ్ర ఆర్థిక, ఆహారం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకు విషమిస్తున్నాయి. ఆందోళనకారుల నిరసనలు హింసాత్మకంగా మారాయి. శ్రీలంకలో నిన్నటి నుంచి జరుగుతున్న హింసాత్మక ఘటనల్లో ఇప్పటి వరకు 7 మంది మరణించారు. 11 మంది పరిస్థితి విషమంగా ఉంది. 260 మందికి తీవ్రగాయాలు కాగా… ఐసీయూలో 60 మంది చికిత్స పొందుతున్నారు. గాయపడ్డ వారిలో ముగ్గురు టూరిస్టులు కూడా ఉన్నారు. ఇప్పటికే మహిందా రాజపక్సే తన ప్రధానికి రాజీనామా చేశారు. భద్రతా కారణాల వల్ల మహిందా…
తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ద్వీపదేశం శ్రీలంకలో ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. ఇన్నాళ్లు శాంతియుతంగా జరిగిన నిరసనలు ఒక్కసారిగా హింసాత్మకంగా మారాయి. ప్రజల్లో అసహనం కట్టలు తెంచుకుంది. ఓ వైపు గోటబయ సర్కార్ ఎమర్జెన్సీ విధించినా… ఆందోళనలు తగ్గడం లేదు. దాదాపుగా గత రెండు నెలల నుంచి శ్రీలంకలో ఆందోళనలు, నిరసనలు జరుగుతున్నాయి. నిత్యావసరాల ధరలు పెరిగిపోవడంతో పాటు గ్యాస్, పెట్రోల్ కొరతతో శ్రీలంక అల్లాడుతోంది. ప్రధాని మహిందా రాజపక్సే రాజీనామా తరువాత శ్రీలంకలో హింసాత్మక…