ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక వ్యక్తిని కేంద్ర దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. ఈయన గతంలో ప్రముఖుల వద్ద సీఏగా పనిచేశారు. అతడి అరెస్ట్ సంచలనంగా మారింది. హైదరాబాద్‌కు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అరెస్ట్ చేసింది. రామచంద్ర పిళ్లై వద్ద చార్టర్డ్ అకౌంటెంట్‌గా పనిచేసిన గోరంట్ల బుచ్చిబాబును ఈరోజు ఉదయం సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.