Gorakhpur: ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లాలో ఉన్న హనుమాన్ ప్రసాద్ పోద్దార్ క్యాన్సర్ ఆసుపత్రిలో శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా గందరగోళ వాతారవరం ఏర్పడింది. దీనికి కారణం.. వేగంగా వచ్చిన ఓ బోలెరో వాహనం అదుపు తప్పి ఆసుపత్రి పార్కింగ్‌లోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో పార్కింగ్‌లో నిలిపి ఉంచిన 16 వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో కొందరు వ్యక్తులు తమ బైక్‌ల పక్కన నిలబడి ఉన్నారు. అయితే వారు ప్రమాదాన్ని అంచనా వేసి సమయానికి పక్కకు తప్పుకోవడంతో…
ఉత్తర ప్రదేశ్ లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. తన సొంత చెల్లెలిని కాలువలో ముంచి చంపాడు అన్న. తన చెల్లెలి ప్రేమ వ్యవహారంతోనే ఈ హత్యజరిగినట్లు సమాచారం. అనంతరం నిందితుడు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. Read Also:Shocking Video: మరీ ఇలా తయారయ్యారేంటమ్మా.. అత్తపై కోడలు దాడి పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లా కాంపియర్‌గంజ్‌లోని భౌరబారి గ్రామంలో ఆదిత్య యాదవ్ అనే యువకుడు తన సొంత చెల్లె అయిన నిత్య యాదవ్ ను…
ప్రేమ వివాహం చేసుకుని ఏడాదైన గడవకముందే భర్త దారుణానికి ఒడిగట్టాడు. ప్రేమ వివాహం చేసుకున్న గోరఖ్‌పూర్‌కు చెందిన ఓ యువకుడు పత్రతులోని కిరిగఢ గ్రామంలో తన భార్యను కదులుతున్న రైలు నుంచి తోసేశాడు. డియోరియా జిల్లాకు చెందిన ఆ మహిళ రైల్వే ట్రాక్ పక్కన ఉన్న కాలువలో పడడంతో తలకు తీవ్ర గాయమైంది. సమాచారం అందుకున్న ఆర్‌పిఎఫ్ ఆ మహిళను రామ్‌గఢ్ సదర్ ఆసుపత్రిలో చేర్చి, ఆమె బంధువులకు సమాచారం అందించింది. రామ్‌గఢ్ జిల్లాలోని పత్రతు బ్లాక్‌లోని…
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మహారాజ్ గంజ్‌లో గూగుల్ మ్యాప్ చూస్తూ డ్రైవర్ కారు నడిపించడంతో అది కాస్తా నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ మీదకి తీసుకుపోయింది. కాగా, కారు డ్రైవర్ గూగుల్ మ్యాప్ సూచనలను అనుసరిస్తూ వెళ్లాడు.. నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్‌ను మ్యాప్ గుర్తించకపోవడంతో.. కారు గాల్లో వేలాడుతూ ఆగిపోయింది.
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన ఒక వ్యక్తి ఒకే రోజు ఒకరికి తెలియకుండా మరొకరిని ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. ఒకరు అతడి ప్రేయసి కాగా, మరొకరు అతడి కుటుంబం కుదిర్చిన అమ్మాయి. ఉదయం లవర్‌ని పెళ్లి చేసుకోగా, సాయంత్రం మరో మహిళను వివాహమాడాడు. ఈ సంఘటన గోరఖ్‌పూర్‌లోని హర్పూర్ బుధాట్ ప్రాంతంలో జరిగింది. ఆ వ్యక్తి గర్ల్‌ఫ్రెండ్ రెండో వివాహం గురించి తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దేశవ్యాప్తంగా నేడు హోలీ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్‌లో జనాల మధ్య పండుగను ఘనంగా జరుపుకున్నారు.
Teen Kills Mother: కొడుకుని స్కూల్ వెళ్లాలని నిద్రలేపేందుకు వెళ్లిన తల్లి హత్యకు గురవుతుందని ఎవరు ఊహిస్తారు. కానీ, ఉత్తర్ ప్రదేశ్ గోరఖ్‌పూర్‌లో ఇలాంటి సంఘటనే జరిగింది. డిసెంబర్ 03న ఆర్తీ దేవి అనే మహిళ తన 17 ఏళ్ల కొడుకు అమన్‌ని స్కూల్‌కి వెళ్లేందుకు నిద్రలేపింది. కానీ సదరు యువకుడు మానసిక స్థితి బాగా లేదు. తన తల్లిపై కోపంతో బలంగా నేలకోసి కొట్టడంతో తలకు బలమైన గాయం తగిలి మరణించింది.
Mystery Man: ఉత్తర్ ప్రదేశ్ గోరఖ్‌పూర్‌లో రాత్రి సమయాల్లో ఇంట్లో నిద్రిస్తున్న మహిళల తలపై కొడుతూ, దొంగతనాలకు పాల్పడుతున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నాలుగు నెలల్లో ఇలాంటి దోపిడీ కేసులు మొత్తం 5 జరిగాయి. ఇందులో ఒక మహిళ మరణించగా, నలుగురు గాయపడ్డారు. నిందితుడు అజయ్ నిషాద్గా గుర్తించారు.
ముగ్గురు మైనర్ల మధ్య ప్రేమాయణం సాగించిన విచిత్రమైన ఉదంతం ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో వెలుగు చూసింది. వాస్తవానికి షాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు మైనర్ బాలికలు ఓ మైనర్ బాలుడితో కలిసి ఇంటి నుంచి పారిపోయారు.