Pakka Commercial ott date fixed: మారుతి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా నటించిన పక్కా కమర్షియల్ మూవీ జూలై 1న థియేటర్లలో విడుదలైంది. మిక్స్‌డ్ టాక్ వచ్చినా ఈ సినిమా మంచి వసూళ్లనే రాబట్టింది. యూవీ క్రియేషన్స్, జీఎ2 పిక్చర్స్ బ్యానర్‌లపై బన్నీవాసు, వంశీ, ప్రమోద్ సంయుక్తంగా నిర్మించారు. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీని ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా తాజాగా వెల్లడించింది. ఆగస్టు 5 నుంచి…
హీరోగా ఎంట్రీ ఇచ్చి విలన్ గా సక్సెస్ అయి ఆ తర్వాత హీరోగా నిలదొక్కుకున్నాడు గోపీచంద్. ప్రముఖ దర్శకుడైన తండ్రి టి. కృష్ణ బాటలో కాకుండా నటుడుగా మారిన గోపీచంద్ కెరీర్ ఇప్పుడు కష్టాల కడలిలో ఉంది.
ఇప్పుడు భారత చిత్రసీమలోని భాషా బేధాలు పూర్తిగా తొలగిపోయిన సంగతి తెలిసిందే! అక్కడి దర్శకులు ఇక్కడి హీరోలతోనో, ఇక్కడి దర్శకులు అక్కడి హీరోలతోనో జత కట్టేస్తున్నారు. ముఖ్యంగా.. టాలీవుడ్, కోలీవుడ్‌లో ఈ క్రేజీ కాంబోలో బోలెడన్నీ కుదిరాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో కలయిక చేరనున్నట్టు కనిపిస్తోంది. అదే.. డైరెక్టర్ హరి, మన మ్యాచో మ్యాన్ గోపీచంద్. తమిళ దర్శకుడు హరి ఎప్పట్నుంచో తెలుగులో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ముఖ్యంగా.. సింగం సిరీస్‌తో తనకు తెలుగులోనూ మంచి…
ఏదైనా ఒక వస్తువు కానీ, ఒక సినిమా కానీ జనాల్లోకి వెళ్ళాలి అంటే కావాల్సింది ప్రమోషన్స్.. అది లేకపోతే ఎన్నని కోట్లు పెట్టి సినిమా తీసినా ప్రేక్షకుల వద్దకు చేరదు.
ఫలానా పాత్రకు ఎవరెవరిని తీసుకోవాలన్న నిర్ణయాలు.. దాదాపు దర్శకులే చేస్తారు. ఆయా పాత్రల్లో ఎవరు సెట్ అవుతారో దర్శకులుగా వాళ్లకి బాగా అవగాహన ఉంటుంది కాబట్టి, నిర్మాతలు వారికే ఆ బాధ్యతలు అప్పగిస్తారు. కానీ, పక్కా కమర్షియల్ సినిమా కోసం హీరోయిన్ విషయంలో తాను జోక్యం చేసుకున్నానంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కుండబద్దలు కొట్టారు నిర్మాత అల్లు అరవింద్. మారుతి తనకు కథ చెప్తున్నప్పుడు.. కథానాయిక పాత్రలో తనకు రాశీ ఖన్నానే కనిపించిందని, ఆమెనే ఇందులో…
పక్కా కమర్షియల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి.. తొలుత అభిమానుల్లో జోష్ నింపేశారు. తానొచ్చింది యూనిట్ కోసం కాదని, మీకోసమేనంటూ అభిమానుల్ని ఉద్దేశంచి చెప్పగానే.. ఆ వేదిక ఒక్కసారిగా ఫ్యాన్స్ కేరింతలతో హోరెత్తిపోయింది. ఈ సినిమా కోసం పని చేసిన వాళ్లందరూ తన కుటుంబ సభ్యుల్లాంటి వాళ్లేనని, వాళ్ల కోసం తను తప్పకుండా రావాల్సిందేనని నిర్ణయించుకొని ఈ ఈవెంట్ కి వచ్చానన్నారు. అయితే.. ఈ ఈవెంట్ కి వచ్చి, మిమ్మల్ని…
‘పక్కా కమర్షియల్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన గోపీచంద్.. తొలుత ముఖ్య అతిథిగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవికి ధన్యవాదాలు తెలిపాడు. అలాగే గతంలో సినిమాల కోసం చిరు పడిన కష్టాల గురించి వేదికపై చెప్పుకొచ్చాడు. ఈరోజుల్లో తాము స్టంట్స్ చేయాలంటే, టెక్నికల్ గా ఎన్నో అందుబాటులో ఉన్నాయని.. కానీ అప్పట్లో రోప్స్ లేకుండానే చాలా కష్టపడ్డారని, అందుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందేనని అన్నాడు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారనడానికి చిరు నిలువెత్తు నిదర్శనమని.. ఇప్పటికీ చాలామంది ఇండస్ట్రీలో రావడానికి…
‘పక్కా కమర్షియల్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో రావు రమేశ్ మాట్లాడిన మాటలకు రాశీ ఖన్నా వంత పాడింది. ఆయన చెప్పింది నూటికి నూరు శాతం నిజమేనని ఫుల్ మార్కులు ఇచ్చేసింది. తొలుత వేదిక మీదకి వచ్చిన రావు రమేశ్.. ‘పక్కా కమర్షియల్ ఎవరు’ అని సుమ ప్రశ్నించగానే, దర్శకుడు మారుతి పేరు తీసుకున్నారు. ఎందుకంటే.. ఆడియన్స్ ఏదైతే కోరుకుంటారో, అదే ఈ సినిమాలో ఆ డైరెక్టర్ పెట్టారన్నాడు. పేపర్ మీద ఉన్న సీన్ల కంటే సెట్స్ లో…
మారుతి, గోపీచంద్ కాంబోలో రూపొందిన ‘పక్కా కమర్షియల్’ సినిమా జులై 1వ తేదీన విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను భారీఎత్తున హైదరాబాద్ శిల్పకళా వేదికలో నిర్వహించారు. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన అడుగుపెట్టడమే ఆలస్యం.. వేదిక మొత్తం ఈలలు, అరుపులతో హోరెత్తిపోయింది. వేదికలో ఉన్న అభిమానులు మొత్తం ‘మెగాస్టార్’ అంటూ కేకలు వేశారు. కాసేపు అక్కడ సందడి వాతావరణం నెలకొంది.…