బుడమేరుకు సంబంధించిన అక్రమ నిర్మాణాలపై హైడ్రా వంటి వ్యవస్థ కంటే ముందుగా ఆక్రమణలు చేసిన వారితో మాట్లాడాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. బుడమేరు ఆక్రమణలు చాలా మంది తెలిసో తెలియకో చేసిన వారు ఉన్నారని ఆయన అన్నారు. ఆక్రమణ స్థలం అని తెలియక కొన్నవారు కూడా ఉన్నారన్నారు.
కాకినాడ జిల్లా గొల్లప్రోలు ముంపు ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు. ఏలేరు వరద ముంపు కారణంగా గొల్లప్రోలులో నీట మునిగిన జగనన్న కాలనీ , పంట పొలాలను ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరిశీలించారు. పడవలో వెళ్లి ముంపు ప్రాంతాలను పరిశీలించారు.
CM Jagan Mohan Reddy: కాకినాడ జిల్లా గొల్లప్రోలులో సీఎం జగన్ వైఎస్ఆర్ కాపునేస్తం మూడో ఏడాది నిధులను లబ్ధిదారుల ఖాతాల్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తమది మనసున్న ప్రభుత్వమని.. మేనిఫెస్టోలో చెప్పకపోయినా వైఎస్ఆర్ కాపునేస్తం అనే పథకాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు. ఈ పథకం ద్వారా ప్రతి కాప�