India wins first gold medal in World Archery Championships: ఎట్టకేలకు భారత్ ఆర్చరీ ‘పసిడి’ కల నెరవేరింది. ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్‌లో ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్న స్వర్ణ పతకం భారత్ ఖాతాలో చేరింది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ, మహారాష్ట్ర అమ్మాయి అదితి స్వామి మరియు పంజాబ్ ప్లేయర్ పర్ణీత్ కౌర్ త్రయం గురి.. దేశానికి తొలి స్వర్ణం అందించింది. ఏ విభాగంలో అయినా దేశానికి ఇదే తొలి పసిడి. బెర్లిన్‌లో శుక్రవారం జరిగిన…
బ్యాంకాక్ లో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో 100 మీటర్ల హర్డిల్స్ ఈవెంట్ లో జ్యోతి యర్రాజీ బంగారు పతకం సాధించింది. జూలై 13న జరిగిన ఈ ఫైనల్ రేసులో జ్యోతి అందరికంటే వేగంగా 13.09 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా అవతరించింది. విశాఖపట్నం జిల్లాకు చెందిన క్రీడాకారిణి జ్యోతి యర్రాజీ.. తన కెరీర్‌లోనే గొప్ప విజయాన్ని సాధించింది.
మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తన మొదటి జియు-జిట్సు టోర్నమెంట్‌లో పాల్గొని బంగారు, రజత పతకాలను గెలుచుకున్నారు. ఫేస్‌బుక్‌లో టోర్నమెంట్ చిత్రాలను పంచుకుంటూ.. "నా మొదటి జియు జిట్సు టోర్నమెంట్‌లో పోటీ పడి గెరిల్లా జియు జిట్సు జట్టు కోసం కొన్ని పతకాలు సాధించాను. నాకు శిక్షణ ఇచ్చినందుకు డేవ్ కమరిల్లో, ఖై వు, జేమ్స్ టెర్రీకి ధన్యవాదాలు!" అంటూ మార్క్ జుకర్‌బర్గ్ పోస్ట్ చేశారు.
సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడి చారిత్రక విజయం సాధించి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఆసియా ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరిన తొలి భారతీయ జంటగా సాత్విక్-చిరాగ్ జోడీ కూడా బంగారు పతకాన్ని గెలుచుకున్నారు.
న్యూఢిల్లీలో జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో 50 కిలోల విభాగం ఫైనల్స్‌లో బంగారు పతకం సాధించిన బాక్సర్ నిఖత్ జరీన్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అభినందించారు.
National Games: జాతీయ క్రీడల్లో తెలంగాణ రాష్ట్రానికి మరో స్వర్ణం సహా మూడు పతకాలు లభించాయి. ఆదివారం జరిగిన పురుషుల బీచ్ వాలీబాల్ ఈవెంట్లో తెలంగాణకు చెందిన కృష్ణ చైతన్య - మహేశ్ జోడీ స్వర్ణం కైవసం చేసుకుంది.
Neeraj Chopra: భారత స్టార్ జావెలిన్ త్రో ఆటగాడు, ఒలింపిక్ ఛాంపియన్ 24 ఏళ్ల నీరజ్ చోప్రా ప్రఖ్యాత డైమండ్ లీగ్ ఛాంపియన్ షిప్‌లో స్వర్ణ పతకం సొంతం చేసుకుని చరిత్ర సృష్టించాడు. ఈ ఘనత సాధించిన మొదటి భారతీయుడిగా నీరజ్ చోప్రా నిలిచాడు. స్విట్జర్లాండ్‌లోని సుసానెలో జరుగుతున్న డైమండ్ లీగ్‌లో మొదటి ప్రయత్నంలోనే జావెలిన్‌ను 89.08 మీటర్ల దూరం విసిరి అందరికంటే ముందంజలో నిలిచాడు. రెండో ప్రయత్నంలో 85.18 మీటర్ల దూరం వేశాడు. మూడో ప్రయత్నంలో…