భారత బాక్సర్లు రెచ్చిపోయారు. 75 కేజీల విభాగంలో భారత బాక్సింగ్ ఛాంపియన్ లవ్లీనా బోర్గోహెయిన్ పసిడి పతకాక్కిన ఒడిసిపట్టింది. ఫైనల్ లో ఆస్ట్రేలియాకు చెందిన కైత్లిన్ పార్కర్ నూ 5-2 తేడాతో విజయం సాధించారు. ఇప్పటికే భారత బాక్సర్ నిఖత్ జరీన్ మరో స్వర్ణ పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. వియత్నాంకు చెందిన గుయెన్ టాన్ను ఓడించి ఈ పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఆదివారం ఢిల్లీ వేదికగా జరిగిన అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం వరల్డ్ సీనియర్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో భాగంగా 50 కేజీల ఫ్లైవెయిట్ విభాగంలో వియత్నాంకు చెందిన క్రీడాకారిణి టి తామ్ న్యూయెన్ ను 5-0 తేడాతో ఓడించి విజయం సాశించింది. ఈ ఫీట్ తో నిఖత్ వరుసగా రెండో ఏడాది ఐబీఏ ఛాంపియన్ షిప్ లోస్వర్ణం గెలిచి విజేతగా నిలిచింది.
Also Read : What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
తెలంగాణకు చెందిన నిఖత్ జరీన్ టోర్నమెంట్ ఫైనల్ లో భారత్ తరపు ప్రాతినిధ్యం వహించారు. సీనియర్ విభాగంలో దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ తర్వాత ఒకటి కంటే ఎక్కువ సార్లు ప్రపంచటైటిళ్లను గెలిచిన రెండో భారత బాక్సర్ గా చరిత్ర సృష్టించారు. అంతేగాక బాక్సింగ్ లో రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన తొలి తెలుగు అమ్మాయి కూడా నిఖత్ జరీన్ మాత్రమే. కాగా, ఈ ఛాంపియన్ షిప్ లో ఇప్పటికే 48 కేజీల విభాగంలో నీతూ ఘాంగస్, 81 కేజీల విభాగంలో స్వీటీ బూర బంగారు పతకాలను సాధించారు.
Also Read : Women’s Premier League: ఢిల్లీ క్యాపిటల్స్పై ముంబై ఇండియన్స్ ఘన విజయం
50 కేజీల ఫ్లై వెయిట్ కేటగిరీలో పోటీపడ్డ నిఖత్ జరీన్ ఈ టోర్నీ తొలి రౌండ్ లో అజర్ బైజాన్ క్రీడాకారిణి ఇస్మాయిలోవా అనఖనిమ్తో తలపడి 5-0 తేడాతో గెలుపొందింది. ఏకపక్షంగా సాగిన బౌట్ రెండో రౌండ్ లోనూ టాప్ సీడర్ అల్జీరియా ప్రత్యర్థి బొవులామ్ రౌమస్యాపై 5-0తో నెగ్గింది. ఇక ప్రిక్వార్టర్స్ మ్యాచ్ లో కూడా మెక్సికోకు చెందిన హరీరా అల్వారెజ్ ఫాతిమాను 5-0తో ఈజీగా ఓడించింది. కాగా, క్వార్టర్స్ లో నిఖత్ థాయ్ లాండ్ క్రీడాకారిణీ రక్సత్ చౌథమట్ నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ ఈ బౌట్ లో నిఖత్ 5-2తో రక్సత్ ను మట్టికరిపించింది. సెమీ ఫైనల లో కూడా ఐదో సీడర్ కొలంబియా క్రీడాకారిణీ వాలెన్సియా క్టోరియాపై 5-0తో గెలిచి వరుసగా రెండో ఏడాది వరల్డ్ ఛాంపియన్ షిప్ ఫైన్ మ్యాచ్ కు అర్హత సాధించి స్వర్ణ పతకాన్ని గెలిచింది.