వర్షాలతో గోదావరి కళకళలాడుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో గోదావరి గలగలలు సందడి చేస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గోదావరిలో నీటి పిల్లులు సందడి చేస్తూ సందర్శకులకు అరుదుగా కనిపించాయి. మహాదేవపూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ ఎగువ కన్నెపల్లి పంప్ హౌస్ సమీపంలో ఈ నీటి పిల్లులు దర్శనమిచ్చాయి. అవి మనుషులకు ఎలాంటి హాని చేయకపోయినా, చేపలు పట్టే మత్స్యకారులకు మాత్రం చాలా నష్టం చేస్తుంటాయి.
మత్స్యకారులు గోదావరిలో చేపల కోసం వేసిన వలలను కొరుకుతుంటాయి. వలలో చిక్కిన చేపలను తింటూ వుంటాయి.అంతేకాకుండా నీటిలో చేపలకన్నా ఎక్కువ వేగంగా ఈదగలుగుతాయి. ఈ నీటి పిల్లులు మేడిగడ్డ బ్యారేజీ నుండి కాళేశ్వరం త్రివేణి సంగమం వరకు తిరుగుతూ సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. చేపలు పట్టేవారు మాత్రం వీటిని చూస్తే మాత్రం వణుకుతుంటారు. వీటి నుంచే వచ్చే శబ్దాలు వినసొంపుగా వుంటాయి.వన్య ప్రాణి సంరక్షకులు వీటిని అరుదైన వాటిగా గుర్తిస్తారు. నీటి ప్రవాహం ఎక్కువగా వున్నప్పుడు చిన్నచిన్న చేపలను ఇవి వేటాడుతూ వుంటాయి.
Talasani Srinivas Yadav : ప్రభుత్వం జోక్యం చేసుకునే వరకు చూడొద్దు