Cinema Chettu: కొన్ని ప్రదేశాలు.. ఆలయాలు, గుట్టలు, చెట్లు ఇలా సజీవంగా నిలిచిపోతాయి.. ఎంతో మంది అభిమానాన్ని చురగొంటాయి.. అయితే, అవి కనుమరుగు అయ్యే పరిస్థితి వస్తే.. చాలా మంది జీర్ణించుకోలేదు.. అలాంటివి మళ్లీ మన కళ్లముందు కదలబోతున్నాయంటే ఆ ఆనందమే వేరు.. అలాంటిది ఇది కూడా.. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం, కుమారదేవం గ్రామం గోదావరి తీరంలో ఉన్న ‘సినిమా చెట్టు’ మళ్లీ జీవం పోసుకుంది. తెలుగు సినిమా అభిమానులకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఈ వృక్షం, గతంలో 300కి పైగా చిత్రాలలో కనిపించి దర్శకులు, నటులను ఆకట్టుకుంది. గతేడాది గోదావరి వరదల సమయంలో ఈ మహా వృక్షం రెండుగా చీలి నేలవాలిపోయింది. దీంతో చెట్టును సినిమాలలో చూసిన వారు, స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చెట్టును రక్షించాలని పలువురు విజ్ఞప్తులు చేశారు.
Read Also: Cyber Crime : 500 కోట్ల సైబర్ మోసాల వెనుక విజయవాడ యువకుడు.. శ్రవణ్ కుమార్ అరెస్ట్
ఈ పరిస్థితిలో రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి.. ఐకాన్స్ ఆధ్వర్యంలో గ్రీన్ భారత్ – వనం మనం విభాగం ప్రత్యేక ప్రాజెక్టును ప్రారంభించింది. ప్రాజెక్టు నిర్వాహకులు పర్యవేక్షణలో చెట్టుకు రసాయనాలతో దీర్ఘకాల చికిత్స అందించారు. దీనితో సినిమా చెట్టు పునరుజ్జీవం సాఫల్యం అయ్యింది. వేరు మధ్య కొత్త అంకురానికి ప్రాణం పోశారు. ప్రస్తుతం అది 10 అడుగుల మొక్కగా పెరిగింది. “ఇంకో ఏడాది రోజుల్లో ఈ మొక్క పెద్దదై, నాలుగైదుగురికి నీడనిచ్చే స్థాయికి చేరుకుంటుంది” తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో క్లాసిక్ సినిమాలకు సాక్షిగా నిలిచిన ఈ చెట్టు పునర్జీవం పొంది మళ్లీ సజీవంగా మారడం, సినీ అభిమానులు మరియు పర్యావరణ ప్రియులకు సంతోషకర విషయమైంది. సినిమా చెట్టు మళ్లీ చిగురించడంతో స్థానికల్లో ఆనందం వెల్లివిరుస్తుంది.