Telangana Rising : సమ్మిట్ కు భారీ బందోబస్తు.. వీవీఐపీ ప్రతినిధుల చుట్టూ మూడంచెల భద్రత
- సమ్మిట్ కు భారీ బందోబస్తు
- టి రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ కమిటీ సభ్యులతో సిపి సమీక్ష సమావేశం
- వీవీఐపీ ప్రతినిధుల చుట్టూ మూడంచెల భద్రత
- వెయ్యికిపైగా సీసీటీవీ కెమెరాల ఏర్పాటు
- సుమారు 2,500 మంది పోలీసు బలగాలతో బందోబస్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డిసెంబర్ 8, 9వ తేదీల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహేశ్వరం, మిర్ఖాన్ పేటలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కి పోలీసుశాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య భారీ బందోబస్త్ కల్పిస్తోంది. ఈరోజు మహేశ్వరంలో బందోబస్త్ మీద రాచకొండ సిపి సుధీర్ బాబు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, టీజీ ICC ఏండి శశాంక్ మహేశ్వరం డీసీపీ నారాయణ రెడ్డి, వాటర్ వర్క్స్ ఎండీ అశోక్ రెడ్డి ట్రాఫిక్ డీసీపీలతో కలిసి టి రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ కమిటీ సభ్యులతో, వివిధ శాఖలతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో వారినుండి పోలీసు శాఖకు ఎలాంటి సహాయ సహకారాలు అందించాలి, పోలీసు శాఖ నుండి వారికి ఎలాంటి సహాయ సహకారాలు ఇవ్వాలి అనేదానిపై నిర్వాహక కమిటీ సభ్యులతో అడిగి తెలుసుకున్నారు. ఈ సదస్సుకు సుమారు 2,500 మంది పోలీసు బలగాలు బందోబస్తులో పాల్గొంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయిలో ఈ సమ్మిట్ నిర్వహిస్తునందున లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులతో పాటు స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్, అక్టోపస్, గ్రేహౌండ్స్, డాగ్, బాంబ్ స్క్వాడ్స్తో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read
- Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- Congress Councillors: కాంగ్రెస్కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
- Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
ఈ సమ్మిట్ కి కావాల్సిన సదుపాయాలపై, బేరక్స్, మెస్, కిచెన్, మరుగుదొడ్ల వంటి మౌలిక సదుపాయల గురించి అధికారులతో చర్చించారు. ఈ గ్లోబల్ సమ్మిట్ కి అంతర్జాతీయ పెట్టుబడి సంస్థల ప్రతినిధులు, బహుళ సంస్థల అధినేతలు, దేశీయ సంస్థల ప్రముఖులు, పారిశ్రామిక దిగ్గజాలతో కలిపి సుమారు 600 మంది ప్రతినిధులు హాజరుకానున్నట్లు అధికారులు వెల్లడించారు.
వీరి సహాయక సిబ్బంది సుమారు మూడు వేల మంది రానున్నారు. వీఐపీ ప్రతినిధుల చుట్టూ మూడంచెల భద్రత ఉంటుంది. గ్లోబల్ సమ్మిట్ జరిగే ప్రాంతంలో అడుగడుగునా నిఘా పెట్టేందుకు సుమారు వెయ్యికిపైగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ సెంట్రల్ పోలీసు కంట్రోల్ రూమ్కు అనుసంధానమై ఉంటాయి. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం సుమారు వెయ్యి మంది ట్రాఫిక్ పోలీసులను నియమించనున్నారు. రహదారుల మళ్లింపు, రూట్ మ్యాప్ లు, బారికేడ్ల ఏర్పాటు, వాహనాల పార్కింగ్ నిర్వహణ వంటి వాటి కోసం ట్రాఫిక్ మార్షల్స్ నియమించుకోనున్నారు. ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం, ఇబ్బందులు జరగకుండా ఆయా మార్గాలను పటిష్టమైన పోలీసు బందోబస్తు ఉంటుంది. సాధారణ ప్రజలు, వాహనదారులకు రెండు రోజుల పాటు ఆయా మార్గాలలో రహదారుల మళ్లింపులు ఉంటాయి. మహిళా పారిశ్రామికవేత్తలు, వక్తల, పెట్టుబడిదారుల భద్రత, రక్షణ కోసం ఉమెన్స్ వింగ్, షీ టీమ్స్ ప్రత్యేకంగా వింగ్ నీ ఏర్పాటు చేశారు.
Akhanda 2 Pre Release: “నందమూరి బాలుడాయ… దొమ్మలేమో అదిరిపాయా” పాట వెనకాల కథ ఇదే..!
తాజావార్తలు
-
Sanju Samson: భారత్, వెస్టిండీస్ సిరీస్.. అభిషేక్ శర్మను దాటేసిన సంజూ శాంసన్..
-
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
-
Abhishek Sharma: కొట్టింది 29 పరుగులే.. అయినా వరల్డ్ రికార్డ్ బద్దలుగొట్టిన కాటేరమ్మకొడుకు..
-
AP Local Body Elections: కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు.. జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?
-
India vs West Indies: మ్యాచ్ ఓడినా.. ఉప్పల్లో రికార్డుల మోత.. టీ20ల్లో భారత్ మరో ఘనత..
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..