Twitter Layoffs: ఐటీ పరిశ్రమలో సంక్షోభం కొనసాగుతోంది. వరసగా టెక్ దిగ్గజాలు తమ ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి ట్విట్టర్ తో ప్రారంభం అయిన ఈ లేఆఫ్స్ ట్రెండ్ మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట, అమెజాన్ ఇలా అన్ని ప్రముఖ సంస్థల్లో కొసాగుతోంది. తాజాగా దేశీయ ఐటీ దిగ్గజం విప్రో కూడా ఫ్రెషర్లను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆర్థికమాంద్యం భయాల నేపథ్యంలో కంపెనీలు తమ ఉద్యోగులను విడిచిపెడుతున్నాయి. ఖర్చులను తగ్గించుకునే పేరుతో ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి.
Read Also: NVSS Prabhakar: కేసీఆర్ కళ్లకి అద్దాలు పెట్టించి.. మోడీ అభివృద్ధిని చూపించాలి..
ఇదిలా ఉంటే మరోసారి ట్విట్టర్ ఉద్యోగులకు షాక్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే మొత్తం ఉద్యోగుల్లో 50 శాతం తొలగిస్తూ ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్ నిర్ణయం తీసుకున్నాడు. ఇదిలా ఉంటే రాబోయే రోజుల్లో కూడా మరిన్ని ఉద్యోగుల కోతల ఉండే అవకాశం ఉందని బిజినెస్ ఇన్‌సైడర్ నివేదించింది. ట్విట్టర్ అడ్వర్టైజ్మెంట్, ట్రస్ట్, సెక్యూరిటీ, మానిటైజేషన్ డిపార్టుమెంట్ల నుంచి వందలాది మందిని తొలగించింది. అమెరికాలో ఉద్యోగుల తొలగింపు ప్రారంభం అవ్వగా.. గత వారం సింగపూర్, ఆస్ట్రేలియా దేశాల్లో తొలగింపులు జరిగాయి.
తాజాగా తన ప్రొడక్ట్ ఆర్గనైజేషన్ నుంచి 50 మందిని తొలగించాలని ట్విట్టర్ అనుకుంటోంది. యూఎస్ఏలో అనేక అంతర్జాతీయ కార్యాలయాలు, చిన్న కార్యాలయాలను మూసేయాలని యోచిస్తున్నట్లు ట్విట్టర్ భావిస్తుందని ఉద్యోగులు అనుకుంటున్నారు. ఇదే జరిగితే ట్విట్టర్ లో ఉద్యోగుల సంఖ్య కేవలం 2000 మాత్రమే పరిమితం అయ్యే అవకాశం ఉంది. దీన్ని బట్టి చూస్తే ట్విట్టర్ లో మొత్తం 75 శాతం మందిని మస్క్ తొలగించినట్లు అవుతుంది. మస్క్ ట్విట్టర్ టేకోవర్ ముందు ఆ సంస్థలో 7000కు పైగా ఉద్యోగులు ఉండే వారు తొలిరౌండ్ లో 50 శాతం మందిని తొలగించాడు. ఇప్పుడు రెండో రౌండ్ కు సిద్ధం అవుతున్నాడు.