Google Layoff: ఆర్థికమాంద్యం ఐటీ ఇండస్ట్రీలో సంక్షోభాన్ని సృష్టిస్తున్నాయి. ఎప్పుడు ఎవరి ఉద్యోగం పోతుందో తెలియని పరిస్థితి. పెద్ద పెద్ద ఐటీ దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులను తీసేస్తున్నాయి. కొత్త, పాత అన్న తేడా లేకుండా ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నాయి. కంపెనీతో దశాబ్ధానికి పైగా అనుబంధం ఉన్న ఉద్యోగులను కూడా నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నారు. దశాబ్ధకాలంగా పనిచేసిన కొందరు ఉద్యోగుల శ్రమ, అంకితభావం, విధేయతలను కంపెనీలు పరిగణలోకి తీసుకోవడం లేదు. ఇప్పటికే ట్విట్టర్, మెటా, మైక్రోసాఫ్ట్, అమెజాన్ తన ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా ఈ జాబితాలో గుగూల్ కూడా చేరింది. ఏకంగా 12,000 మందిని తొలగిస్తున్నట్లు వెల్లడించింది.
Read Also: TSRTC: టీఎస్‌ఆర్టీసీకి భారీ ఆదాయం.. 11 రోజుల్లోనే రూ.165.46 కోట్ల రాబడి
కంపెనీలో దాదాపుగా 16.5 ఏళ్లు పనిచేసిన జస్టిస్ మూర్ అనే ఉద్యోగిని ఎలాంటి సమాచారం లేకుండా ముందస్తు హెచ్చరికలు లేకుండా తీసేసింది. గూగుల్ లో సీనియర్ ఇంజనీర్ మేనేజర్ అయిన మూర్ కు తెల్లవారుజామున 3 గంటలకు తొలగింపుకు సంబంధించి సమాచారం వచ్చింది. అర్థరాత్రి తన అకౌంట్ అకాస్మత్తుగా డీయాక్టివేట్ అయిందని ఆయన వెల్లడించారు. ఇంతకు ముందు ఇలాగే మైక్రోసాఫ్ట్ 21 ఏళ్లు పనిచేసిన ఓ భారతీయ ఉద్యోగిని కూడా ఇలాగే తీసేసింది. ఆయన తన ఆవేదనను లింక్డ్ ఇన్ ద్వారా పంచుకున్నాడు. ఇది వైరల్ గా మారింది.
తాజాగా గూగుల్ ఉద్యోగి జస్టిన్ మూర్.. తన ఆవేదనను లింక్డ్ఇన్ ద్వారా పంచుకున్నారు. తాను, తన టీం సాధించిన విజయాలకు గర్వపడుతున్నానని.. పని కోసం మీ జీవితాన్ని మొత్తం వినయోగించుకోకూడదు. ముఖ్యంగా గూగుల్ వంటి పెద్ద కంపెనీల యజమానులు నిర్ధాక్షిణ్యంగా ఉంటారు. పని కాకుండా జీవితాన్ని ఎంజాయ్ చేయాలంటూ వ్యాఖ్యానించాడు. దీనికి ప్రతిగా గూగుల్ లో మరో సాఫ్ట్వేర్ ఇంజనీర్ రిచర్డ్ హే కూడా 15.5 ఏళ్ల సర్వీస్ తర్వాత తనను కూడా మూర్ లాగే తొలగించారని చెప్పాడు.