Railways: మొన్న హనీమూన్, నేడు బర్త్ డే.. వివాదాల పాలవుతున్న రైల్వే..
- రైలులో బర్త్ డే వేడుకలు..
- రైలులో టికెట్ తనికీ సిబ్బంది సెలబ్రేషన్స్..
- విచారణ ప్రారంభించిన ఉన్నతాధికారులు..
- ఇటీవల రైలులోనే హనీమూన్ ఏర్పాట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Railways: ఇటీవల రైలులో ‘‘హనీమూన్’’ కోసం ఏర్పాట్లు చేయడం, దానికి సంబంధించిన ఫోటోలు వైరల్ కావడంతో రైల్వే శాఖ విమర్శలు ఎదుర్కొంది. ఇది మరవకముందే బర్త్ డే పార్టీ వెలుగులోకి వచ్చింది. ఝాన్సీ గుండా వెళుతున్న న్యూఢిల్లీ-భోపాల్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లోని ఒక కోచ్‌లో టికెట్ తనిఖీ సిబ్బంది పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. వైరల్ అవుతున్న ఈ 44 సెకన్ల వీడియోలో, ఝాన్సీకి చెందిన తనిఖీ సిబ్బంది తమ డ్యూటీ యూనిఫాంలో మరో ఉద్యోగి బర్త్ డే వేడుకలు నిర్వహించడం వీడియోలో కనిపించింది. కేక్ కట్ చేసి, పూలమాల వేస్తూ ఉద్యోగులు కనిపిస్తారు. ఈ సంఘటన మూడు నాలుగు రోజుల క్రితం జరిగినట్లు తెలుస్తోంది.
తాజా బర్త్ డే ఘటనలో ఉద్యోగులు న్యూఢిల్లీ-భోపాల్ శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌లో టికెట్ ఇన్స్పెక్టర్లని భావిస్తున్నారు. విధి నిర్వహణలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం ఏమిటనే విమర్శలు వస్తున్నాయి. ఈ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన వీడియో తన దృష్టికి వచ్చిందని ఝాన్సీ డివిజన్ పీఆర్ఓ మనోజ్ కుమార్ తెలిపారు. దీనిపై రైల్వే యంత్రాంగం దర్యాప్తు ప్రారంభించింది. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోనుంది.
Also Read
- Prakash Raj: "నా ఓటు తొలగించి, ఆట మొదలుపెట్టారు".. SIRపై ప్రకాష్ రాజ్ వార్నింగ్..
- Delhi Alert: రెడ్‌ఫోర్ట్ నుంచి మెట్రో స్టేషన్ల వరకు నిఘా.. ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం.. 19 మంది ఉగ్రవాదుల పోస్టర్లు విడుదల..
- Government Schools Decline: ఒకే ఏడాదిలో 9,900 ప్రభుత్వ పాఠశాలల మూత... తెలుగు రాష్ట్రాల్లో భారీగా..! కారణమేంటి?
- H1N1 Cases Rise: మళ్లీ H1N1 వైరస్ విజృంభణ.. లక్షణాలు ఏంటి? ఎవరికి ప్రమాదం ఎక్కువ?
గతంలో జూన్ 6, 2026న నందిగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌లో ఒక హనీమూన్ సూట్ ఏర్పాటు చేయడం వివాదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో రైల్వే శాఖ దీనిని సమోటోగా స్వీకరించి దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసులో టికెట్ తనఖీ సిబ్బందిని బాధ్యులుగా గుర్తించి వారిని సస్పెండ్ చేశారు.
शताब्दी एक्सप्रेस में टिकट चेकिंग स्टाफ के बर्थडे सेलिब्रेशन का वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है। वीडियो में ट्रेन के कोच के अंदर रेलवे स्टाफ साथी का केक काटकर जन्मदिन मनाता नजर आ रहा है। मामला सामने आने के बाद रेलवे प्रशासन ने जांच की बात कही है। #ShatabdiExpress… pic.twitter.com/7Mf6YR6fmJ
— मारवाड़ी न्यूज़ (@MarwadiNews_) August 11, 2026
తాజావార్తలు
-
Railways: మొన్న హనీమూన్, నేడు బర్త్ డే.. వివాదాల పాలవుతున్న రైల్వే..
-
Lenin OTT: జీ5లో ‘లెనిన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్!
-
Viswanath and Sons’ Censor : విశ్వనాథ్ అండ్ సన్స్’ సెన్సార్ టాక్.. సింపుల్ బ్లాక్‌బస్టర్
-
USA: ఉద్యోగంలో చేరిన కొన్ని రోజులకే.. అమెరికాలో ఏపీకి చెందిన టెక్కీ మృతి..
-
Public Wi-Fi Risks: ఎయిర్పోర్ట్, రైల్వేస్టేషన్, హోటళ్లు.. ఇలా పబ్లిక్ Wi-Fiకి కనెక్ట్ అవుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ట్రెండింగ్
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?