ప్రియురాలి ఇంట్లోనే ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉయ్యూరులో కలకలం రేపుతోంది.. గతంలో ప్రేమించుకున్న ఓ జంట.. మనస్పర్ధలు రావడంతో 2021లో విడిపోయారు.. అప్పటి నుంచి వాళ్లు దూరంగానే ఉంటున్నారని చెబుతున్నారు.. అయితే, గత రాత్రి తన మాజీ ప్రియురాలి ఇంటికి వెళ్లిన ప్రియుడు.. తనకు ఇచ్చి పెళ్లి చేయాలని.. సదరు యువతి కుటుంబ సభ్యులను అడిగాడు.. కానీ, వాళ్లు పెళ్లికి నిరాకరించడంతో.. అక్కడే ఆత్మహత్య చేసుకున్నట్టుగా చెబుతున్నారు..
సోషల్ మీడియాలో ఎన్నో రకాలైన వీడియోలు ఉంటాయి. అందులో కొన్ని ఫన్నీవీ ఉంటే.. మరి కొన్ని హర్రర్ ఇతరత్రా వీడియోలు దర్శనమిస్తాయి. అయితే ఎక్కువగా ఫన్నీ వీడియోలను చూడటానికే నెటిజన్లు ఇష్టపడతారు. కొన్ని నమ్మే రకంగా ఉంటే..మరి కొన్ని నమ్మశక్యం కానీ వీడియోలు ఉంటాయి. అయితే.. ఇటీవల, బీహార్ లో ఒక షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ప్రేమికురాలి కోసం కొందరు ఎంతకైనా తెగిస్తుంటారు. ఆ మోజులో ఉన్నవారు మైకంలో ఉండి ఏం చేస్తారో కూడా అర్థం కాదు. ఇలాంటి సంఘటనే ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది.
మహారాష్ట్ర పూణేలోని చర్హోలీ గ్రామంలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి చనిపోయిన కొద్ది రోజులకు తిరిగి వచ్చాడు. చనిపోయిన వ్యక్తి ఎలా వచ్చాడు? అసలు ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకుందాం.. పూణేలోని చర్హోలీ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు పొలంలో మృతదేహాన్ని కనుగొన్నారు. ఈ మృతదేహం పొలాలు దున్నేందుకు ఉపయోగించే రోటావేటర్‌లో ఇరుక్కుపోయి ఛిద్రమైంది. మొండెం పైనుంచి తల కూడా పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దుస్తులను గుర్తించగా మృతదేహం…
యూపీలోని మీరట్‌లో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. లోహియానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విద్యార్థిని బాయ్‌ఫ్రెండ్ ఆత్మహత్యకు కారణమని, విద్యార్థినిని మోసపూరితంగా వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. ఈ వీడియో విద్యార్థి కుటుంబ సభ్యులకు చేరడంతో తీవ్ర మనస్తాపంతో విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
రైలు కిందపడి ప్రాణాలు తీసుకోవాలనుకున్నారు.. పట్టాలపైకి ఎక్కారు.. తీరా రైలు వచ్చే సమయానికి ఓ ప్రేమికుడు.. తన ప్రియురాలు బతకాలని అనుకున్నాడు.. దీంతో.. ప్రియురాలిని రైలు పట్టాల పై నుంచి కిందకి తోసేసి.. తాను మాత్రం రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు..
శ్రీవారి మెట్టు మార్గంలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసింది.. ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్యయత్నం చేయడంతో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది.. పెళ్లై.. ముగ్గురు పిల్లలు ఉన్న ఓ మహిళ.. ఓ యువకుడి ప్రేమలో పడింది. మూడు రోజుల క్రితం ఇద్దరు ఇంటి నుంచి పారిపోయారు. చంద్రగిరిలోని శ్రీవారిమెట్టు నడక మార్గం 450వ మెట్టు దగ్గరకు చేరుకున్నారు. ఇద్దరు కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
అర్థరాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళ్లిన ఓ ప్రియుడికి ఘోర అనుభవం ఎదురైంది. చీకట్లో ప్రియురాలి కోసం వెళ్తుండగా గ్రామస్తుడు ఒకతను చూశాడు. అతను చూడకుండా ఉండేందుకు దాక్కోవడంతో.. విషయం సీరియస్ గా మారింది. దీంతో.. ప్రేమికుడిని చూసిన గ్రామస్తుడు.. గట్టిగా కేకలు వేశాడు. దీంతో.. గ్రామస్తులంతా కలిసి కర్రలు పట్టుకుని వచ్చి యువకుడిని దొరకబట్టి చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టారు. ఈ ఘటన యూపీ ఇటావాలోని రాంపుర గ్రామంలో జరిగింది.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కిపురం మండలంలో ఈ నెల 10వ తేదీన జరిగిన యువకుడి హత్య కేసును ఛేదించారు పోలీసులు.. ప్రియుడి హత్య వెనుక ప్రియురాలు ఉన్నట్టుగా గుర్తించారు.. ఈ ఘటనపై మీడియాతో మాట్లాడిన రాజోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ గోవిందరాజు.