Lenin OTT: జీ5లో ‘లెనిన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lenin OTT: థియేటర్లలో వంద కోట్ల వసూళ్లతో సెన్సేషన్ క్రియేట్ చేసిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’ ఇప్పుడు ఓటీటీలోనూ అదే జోరును కొనసాగిస్తోంది. ఆగస్టు 7న జీ5లో స్ట్రీమింగ్కు వచ్చిన ఈ సినిమా కేవలం రెండు రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను దాటడం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. థియేటర్లలో ప్రేక్షకుల నుంచి వచ్చిన ఆదరణతో ఓటీటీలోనూ అదే జోరు కొనసాగిస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో రూపొందిన ‘లెనిన్’ ను మురళి కిషోర్ అబ్బూరు తెరకెక్కించారు. మనం ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పీ, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. థియేటర్లలో విడుదలైన తర్వాత సినిమాకు బ్లాక్‌బస్టర్ టాక్ రావడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల వసూళ్ల మార్క్‌ను అందుకుంది. ఇప్పుడు డిజిటల్ రిలీజ్ తర్వాత కూడా ప్రేక్షకుల నుంచి క్రేజీ రెస్పాన్స్ వస్తోంది.
ఆగస్టు 7 నుంచి జీ5లో అందుబాటులోకి వచ్చిన ‘లెనిన్’ను రెండు రోజుల్లోనే భారీ సంఖ్యలో ప్రేక్షకులు వీక్షించారు. మొత్తం 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను దాటడం ద్వారా ఈ సినిమా ఓటీటీ పెర్ఫార్మెన్స్లోనూ ప్రత్యేకమైన మైలురాయిని అందుకుంది. వ్యూస్ కంటే ప్రేక్షకులు సినిమాను ఎంతసేపు చూస్తున్నారనే విషయాన్ని సూచించే స్ట్రీమింగ్ మినిట్స్ పరంగా ఈ మూవీకి వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే ప్రేక్షకులు ఏ రకంగా ముగ్ధులయ్యారో చెప్పకనే చెబుతోంది. రాయలసీమలోని చిత్తూరు జిల్లా రామచంద్రపురం గ్రామంలో జరిగే ద్రౌపదమ్మ తిరునాళ్ల నేపథ్యంగా ‘లెనిన్’ కథ సాగుతుంది. తన ప్రాణ స్నేహితుడి ద్రోహం వల్ల లెనిన్ జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి, అతను జైలుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, రామచంద్రపురంలో జరిగిన ఘర్షణలో చివరికి ఎవరు గెలిచారు అనేది కథలోని ప్రధాన అంశాలుగా నిలుస్తాయి.
Also Read
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
ఇందులో అఖిల్ అక్కినేని రా అండ్ రస్టిక్ లుక్‌లో కనిపించిన విధానం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఆయన నటనకు థియేటర్లలోనే కాకుండా ఓటీటీ ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే గ్లామర్‌తో పాటు తన నటనతో ఆకట్టుకున్నారు. దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరు కథ, కథనం, టేకింగ్‌కు ప్రశంసలు దక్కాయి. సాంకేతికంగా కూడా ‘లెనిన్’కు మంచి స్పందన వచ్చింది. థమన్ అందించిన సంగీతం, లియోన్ బ్రిట్టో కెమెరా వర్క్ సినిమాకు రస్టిక్ విజువల్ టోన్‌ను తీసుకొచ్చింది. మొత్తానికి థియేటర్లలో రూ.100 కోట్ల విజయాన్ని అందుకున్న ‘లెనిన్’, ఇప్పుడు జీ5లో కేవలం రెండు రోజుల్లో 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ దాటడంతో తన సక్సెస్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. మొదటి రెండు రోజుల్లోనే ఈ స్థాయి స్పందన రావడంతో రాబోయే రోజుల్లో సినిమా ఓటీటీలో మరెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!