Nagpur: ప్రియురాలి కోసం మైనర్ ఎంతకు తెగించాడు.. అర్ధరాత్రి గిడ్డంగికెళ్లి ఏం చేశాడంటే..!
- ప్రియురాలి కోసం బరితెగించిన మైనర్
- ఐఫోన్ కొనేందుకు భారీ దోపిడీ
- పోలీసులకు అడ్డంగా దొరికిన నిందితులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలిసీతెలియని వయసులో కొందరు పిల్లలు ఏం చేస్తున్నారో అంతు చిక్కడం లేదు. వ్యామోహమో.. లేదంటే బడాయి కోసమో.. లేదంటే సినిమాల ప్రభావమో తెలియదు గానీ.. మీసాలు కూడా రాని వయసులోనే ప్రేమలో పడుతున్నారు. అంతటితో ఆగుతున్నారంటే అది లేదు. ప్రేయసిని మెప్పించేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటుచేసుకుంది.
ఓ మైనర్‌కు ప్రియురాలు ఉంది. ఐఫోన్ బహుమతి ఇవ్వాలని ఆమె కోరింది. అంతే తడువుగా చేతిలో చిల్లుగవ్వ లేకపోయినా కొనిస్తానని మాటిచ్చాడు. అయితే ప్రేయసికి ఎలాగైనా ఐఫోన్ కొనాలని పూనుకున్నాడు. బుర్రకు పదునుపెట్టి భారీ దోపిడీకి స్కెచ్ గీశాడు. దీనికి తన స్నేహితుల సాయం కోరాడు. అంతే తడువుగా ఓ గిడ్డంగిలో రూ.12 లక్షల విలువైన సామాగ్రి దొంగిలించారు. పాపం పండి అడ్డంగా దొరికిపోయారు.
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
నాగ్‌పూర్‌లోని లకడ్గంజ్ ప్రాంతానికి చెందిన రాహుల్ జైచంద్‌కు కల్మానా ప్రాంతంలో ‘రాహుల్ సిరామిక్స్ ప్రైవేటు లిమిటెడ్’’ పేరుతో టైల్, శానిటరీ వేర్, సిపి ఫిట్టింగ్స్ గిడ్డంగి ఉంది. అయితే మే 27-28 తేదీల మధ్య గుర్తు తెలియని వ్యక్తులు పైకప్పు రేకుల షీట్లను తొలగించి రూ.12 లక్షల విలువైన అత్యంత ఖరీదైన శానిటరీ ఉత్పత్తులను దొంగలించారు. దీంతో రాహుల్ జైచంద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీరియస్‌గా తీసుకున్న కలమ్నా పోలీసుల దర్యాప్తు బృందం.. సీసీటీవీ కెమెరాలను జల్లెడ పట్టారు. మొత్తానికి మైనర్ దొంగలను పట్టుకున్నారు. కేవలం 12 గంటల్లోనే దొంగతనాన్ని ఛేదించారు.
పోలీసులు షాక్
ఈ కేసులో ప్రధాన అనుమానితుడితో పాటు ఇద్దరు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మైనర్లను క్షుణ్ణంగా విచారించగా నేరాన్ని ఒప్పుకున్నారు. దొంగతనానికి చెప్పిన కారణం తెలుసుకుని పోలీసులు సైతం దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రేయసికి ఖరీదైన ఐఫోన్ కొనివ్వాలనుకున్నామని, అందుకు తమకు డబ్బు అత్యవసరమని ఒప్పుకున్నారు. ఆ కోరికతోనే గిడ్డంగిని లక్ష్యంగా చేసుకున్నట్లు చెప్పుకొచ్చారు. దొంగిలించిన విలాసవంతమైన డిజైనర్ కుళాయిలను ఒక వీధి వ్యాపారికి కేవలం 20,000 రూపాయలకే అమ్మినట్లు మైనర్లు చెప్పారు. వస్తువులను కొనుగోలు చేసిన ప్రధాన నిందితుడు.. 38 ఏళ్ల ఇర్ఫాన్ అలీ అలియాస్ ఇమ్ము రంజాన్ అలీని పోలీసులు అరెస్టు చేయగా.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నిందితుల నుంచి రూ. 6.5 లక్షల విలువైన విలాసవంతమైన డిజైనర్ ట్యాప్‌లను స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
-
Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
-
Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!