పిల్లలు ఉత్సాహంగా ఆడుకుంటుండగా జరిగిన ఓ ఘటన ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.. సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్‌లో ఎయిర్ గన్ పేలి బాలిక మృతిచెందింది.. పిల్లల ఆడుకుంటుండగా ఈ ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు.. వెంటనే బాలికను ఉస్మానియా ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసిన అప్పటికే మృతిచెందినట్టు తెలుస్తోంది.. ప్రస్తుతం బాలిక శాండ్వి మృతిదేహం ఉస్మానియా ఆస్పత్రిలో…
సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా పెరిగిపోయింది. యువతీయువకులు సోషల్ మీడియా ప్లాట్ ఫాంలను దుర్వినియోగం చేసుకుంటున్నారు. తాజాగా ఓ యువతి మోసపోయి కేటుగాళ్ళ చేతిలో అత్యాచారానికి గురైన సంగతి తెలిసిందే. శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి కేసుకి సంబంధించిన వివరాలు మీడియాకు వివరించారు. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన యువతిపై అత్యాచారం చేశారు. మంగళవారం సాయంత్రం ఎనిమిది గంటల ప్రాంతంలో డయల్ 100 కు కాల్ వచ్చింది. కాల్ వచ్చిన వెంటనే పరిధిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్…
సాధారణంగా పాములు చూస్తే ఎవరికైనా భయమే. పాము అంటే విష జంతువు అనే అనుకుంటాం. మన మైండ్‌లో అలానే ఉండిపోతుంది. అయితే, పామును చూడగానే దాన్ని చంపేస్తాం లేదంటే స్నేక్ క్యాచర్స్‌ను పిలిపించి దాన్ని అప్పగిస్తాం. అయితే, కొన్ని పాములను జాగ్రత్తగా పెంచుకుంటే అవి స్నేహితుల్లా మారిపోతాయి. దానికి ఓ ఉదాహరణ ఈ వీడియో. ఓ యువతి తన మెడలో కొండచిలువను ఉంచుకొని దాని తల ముందు భాగంలో ముద్దుపెట్టింది. ఆ ముద్దుకు పరవసించిపోయిన ఆ కొండచిలువ…
కామాంధులు రెచ్చిపోతున్నారు.. ఎక్కడ, ఎప్పుడు, ఎలాంటి వార్తలు వినవాల్సి వస్తుందో అనే ఆందోళనక కలిగించే పరిస్థితి నెలకొంది.. ఇక, ఈ మధ్య వరుసగా హైదరాబాద్‌లో వెలుగుచూస్తున్న దారుణమైన ఘటనకు ఆందోళనకు గురిచేస్తున్నాయి.. హైదరాబాద్ శివారు ప్రాంతాలలో ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయి. రాజేంద్రనగర్ హైదర్‌గూడలో అభం శుభం తెలియని బాలికపై అత్యాచారయత్నం చేశాడో గుర్తుతెలియని యువకుడు. బాలిక కేకలు విని స్థానికులు అక్కడికి చేరుకున్న స్థానికులు.. కామాంధుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. అతన్ని…
సంగారెడ్డి జిల్లాలో దారుణంలో చోటు చేసుకుంది. 7 సంవత్సరాల మైనర్ బాలిక కిడ్నాప్ కలకలం రేపింది. సంగారెడ్డికి చెందిన బాలికను కిడ్నాప్ చేసి జోగిపేట వైపు బైక్ పై తీసుకు వెళ్లారు కొందరు దుండగులు. శివ్వంపేట కల్లు దుకాణంలో కల్లు సేవించేందుకు బాలికను వెంట తీసుకెళ్లారు ఆగంతకులు. చిన్నారి ఏడుస్తుండడంతో అనుమానంతో గ్రామస్థులు ఆగంతకులను నిలదీశారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వినాయక విగ్రహాలను చూపిస్తామంటూ బాలికను నమ్మించి కిడ్నాప్ చేసినట్లు అంగీకరించారు నిందితులు. బాలికను…
చిన్న పిల్లలకు ఏదైనా కొత్తగా కనిపిస్తే దానిని పరిశీలించి చూస్తారు. అందులో ఏముందో తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఇలానే, ఓ చిన్నారి తన ఇంట్లోని పై గదిలో ఉన్న చిన్న కన్నంలోకి తలపెట్టింది. అలా దూరిన తల మరలా తీసేందుకు రాలేదు. దీంతో భయపడిన చిన్నారి పెద్దగా కేకలు వేయడం మొదలు పెట్టింది. ఆ కేకలు విన్న తల్లిదండ్రులు పరుగున అక్కడికి చేరుకున్నారు. కూతురిని ఆ కన్నం నుంచి బయటకు తీసే ప్రయత్నం చేశారు. కానీ…
బాల్యంలో మనల్ని ప్రభావితం చేసే అంశాలే వారి జీవితాల్ని నిర్ధేశిస్తాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రజల జీవన విధానం ఎలా మారిపోయిందో చెప్పక్కర్లేదు. తాలిబన్లనుంచి తప్పించుకొని పొట్ట చేతపట్టుకొని పిల్లలతో కలిసి దొరికిన విమానం పట్టుకొని శరణార్ధులుగా వివిధ దేశాలకు వెళ్లిపోతున్నారు. ఆఫ్ఘనిస్తానీయులకు ఆశ్రయం ఇస్తున్న దేశాల్లో బెల్జియం కూడా ఒకటి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అనేక మంది శరణార్ధులుగా బెల్జియంకు వెళ్తున్నారు. అక్కడ ఆర్మీ ఏర్పాటు చేసిన క్యాంప్‌లలో నివశిస్తున్నారు. ఇలా ఆఫ్ఘనిస్తాన్ నుంచి బెల్జియం చేరుకున్న ఓ చిన్నారి…
వారిద్దరిదీ ఒకే గ్రామం… కాకపోతే వేరువేరు కులాలు. మనసులు కలవడంతో ప్రేమించుకున్నారు. గ్రామం నుంచి ఢిల్లి వెళ్లి పెళ్లిచేసుకున్నారు. ఏడాది కాలంగా ఢిల్లీలోనే ఉండిపోయారు. అయితే, యువతి గర్భం దాల్చడంతో ఇద్దరూ సొంత గ్రామానికి తిరిగి వచ్చారు. గ్రామంలోకి తిరిగి వచ్చిన వీరికి ఊహించని బహుమానం లభించింది. గ్రామంలోకి అడుగుపెట్టాలంటే పంచాయతీకి రెండున్నర లక్షల రూపాయల జరిమానా కట్టాలని, జరిమానా కట్టకుంటే గ్రామంలోకి అడుగు పెట్టనివ్వమని పంచాయతీ పెద్దలు తీర్పు ఇచ్చారు. యువకుడు లడ్డూసింగ్ తండ్రి యువతి…
ఎప్పుడో ఐదేళ్ల క్రితం ఓ యువతి ఇంటి నుంచి బయటకు వచ్చి తప్పిపోయింది. తప్పిపోయిన యువతి కోసం తల్లిదండ్రులు పోలిస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. కానీ, ఉపయోగం లేకుండా పోయింది. అయితే, అలా తప్పిపోయి యువతి ఐదేళ్ల తరువాత తిరిగి ఇంటికి వస్తున్నట్టు తల్లిదండ్రులకు సమాచారం అందింది. ఈ సంఘటన విజయనగరం జిల్లాలోని గుమ్మల లక్షీపురం మండలంలోని టిక్కబాయి గ్రామానికి చెందిన జయసుధ అనే యువతి మతిస్థిమితం లేక పుదుచ్చెరి వేళ్లే రైలు ఎక్కి వెళ్లిపోయింది. రైల్వే…
హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ కాపాలదారు కూతురు(13)పై జిహెచ్ఎంసి ఔట్ సోర్సింగ్ ఉద్యోగి అత్యాచారానికి పాల్పడ్డాడు. జగద్గిరిగుట్ట పీఎస్ పరిధి మహదేవపురంలో ఉన్న జంతువుల సంరక్షణ కేంద్రం (Animal Care center)లో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. షెల్టర్ మేనేజర్ గా గత కొన్నేళ్లుగా ఔట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి భాస్కర్ రావు తన కుటుంబంతో కలిసి అక్కడే ఉంటూ జంతువుల సంరక్షణ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నాడు. అక్కడే బాధిత బాలిక…