చిన్న పిల్లలకు ఏదైనా కొత్తగా కనిపిస్తే దానిని పరిశీలించి చూస్తారు. అందులో ఏముందో తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఇలానే, ఓ చిన్నారి తన ఇంట్లోని పై గదిలో ఉన్న చిన్న కన్నంలోకి తలపెట్టింది. అలా దూరిన తల మరలా తీసేందుకు రాలేదు. దీంతో భయపడిన చిన్నారి పెద్దగా కేకలు వేయడం మొదలు పెట్టింది. ఆ కేకలు విన్న తల్లిదండ్రులు పరుగున అక్కడికి చేరుకున్నారు. కూతురిని ఆ కన్నం నుంచి బయటకు తీసే ప్రయత్నం చేశారు. కానీ కుదరక పోవడంతో వెంటనే ఫైర్ స్టేషన్‌కు ఫోన్ చేశారు. అగ్నిమాపక సిబ్బంది మొదట డ్రిల్లింగే చేసేందుకు ప్రయత్నం చేశారు. కాని సీలింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉండంతో వెజిటేబుల్ ఆయిల్‌ను ఆ కన్నానికి చిన్నారి మెడకు అప్లై చేస్తూ తలను మెల్లిగా బయటకు తీశారు. అదృష్టవశాత్తు ఆ చిన్నారికి ఎలాంటి గాయాలు కాలేదు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో వచ్చి ఆ పాపను రక్షించడానికి కనీసం గంట సమయం పట్టింది.