Gerogia Meloni: ఇటలీ ప్రధాని జార్జియా మెలోని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆమె ప్రభుత్వం దేశవ్యాప్తంగా బుర్ఖా, నిఖాబ్‌లను నిషేధించే బిల్లును తీసుకువచ్చింది. ప్రధాని మెలోని నేతృత్వంలోని ఇటలీ పాలక పార్టీ బుధవారం దేశ పార్లమెంటులో ముస్లిం మహిళలు దేశవ్యాప్తంగా అన్ని బహిరంగ ప్రదేశాల్లో తమ ముఖాలను, శరీరాలను కప్పి ఉంచే బుర్ఖాలు, నిఖాబ్‌లను ధరించడాన్ని నిషేధించే బిల్లును ప్రవేశపెట్టింది. ఇటలీలో అధికార పార్టీ బ్రదర్స్ ఆఫ్ ఇటలీ, ఇస్లామిక్ వేర్పాటువాదాన్ని ఎదుర్కొనేందుకు ఈ బిల్లును తీసుకువచ్చినట్లు…
ప్రధాని మోడీ పుట్టినరోజు సందర్భంగా దేశ, విదేశాల నుంచి రాజకీయ, సినీ ప్రముఖులంతా బర్త్‌డే విషెస్ చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.. ఇలా ఆయా దేశాలకు సంబంధించిన నాయకులంతా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.
ఇటలీ ప్రధాని జార్జియా మెలోని భారతీయ సంప్రదాయాన్ని అలవాటు చేసుకుంటున్నారు. సోమవారం అమెరికాలో మెలోని పర్యటించారు. జెలెన్‌స్కీకి మద్దతుగా యూరోపియన్ నేతలంతా తరలివచ్చారు.
కెనడాలో జరుగుతున్న జీ 7 శిఖరాగ్ర సమావేశంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని మోడీ-ఇటలీ ప్రధాని మెలోని కలుసుకున్నారు. దీంతో ఇద్దరి కలిసి కరచాలనం చేసుకున్నారు. చాలా సేపు షేక్‌హ్యాండ్ ఇచ్చుకుంటూ.. ఇద్దరు నవ్వుకుంటూ సంభాషించుకున్నారు.
ఇటలీ ప్రధాని మెలోనీ గురువారం అమెరికాలో పర్యటించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మెలోనీ సమావేశమై సుంకాలపై చర్చించారు. అన్ని దేశాలపై ట్రంప్ భారీగా సుంకాలు పెంచేశారు. దీంతో ప్రపంచ మార్కెట్లు ఘోరంగా దెబ్బ తిన్నాయి.
Donald Trump: ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోనీ అంటే తనకు చాలా ఇష్టమని అగ్రరాజ్యం అధినేత డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. మెలోనీ గొప్ప ప్రధాని, వ్యక్తిగతంగానూ ఆవిడతో నాకు మంచి అనుబంధం ఉందని పేర్కొన్నారు.
Giorgia Meloni: ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ముందు మోకాళ్లపై కూర్చున్న అల్బేనియా ప్రధాని ఏడీ రామా వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. మెలోని 48వ పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు ఆయన అందమైన స్కార్ఫ్ బహూకరించారు. ఈ గిఫ్ట్ ఇచ్చేందుకు మోకాళ్లపై వంగాడు. ఈ ఘటన అబుదాబిలో జరుగుతున్న ‘‘వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమ్మిట్’’లో చోటు చేసుకుంది.
Giorgia Meloni: బిలియనీర్ జార్జ్ సోరోస్ విదేశాల రాజకీయాల్లో జోక్యానికి పాల్పడుతున్నాడని ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోని కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఇత దేశాల రాజకీయాల్లో కలుగుజేసుకుంటున్నారని ఆమె అన్నారు. దేశాలను అస్థిరపరచడానికి తన డబ్బును ఉపయోగిస్తున్నారని మెలోనీ గురువారం అన్నారు. యూరప్ రాజకీయాల్లో ఎలాన్ మస్క్ జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు, విమర్శలు వస్తున్న తరుణంలో మెలోనీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో యూరప్‌లో రాజకీయాల…
PM Modi: నిఖిల్ కామత్‌తో తొలిసారి ప్రధాని నరేంద్రమోడీ పోడ్‌కాస్ట్‌లో పాల్గొన్నారు. తన చిన్నతనం నుంచి రాజకీయంగా ఎదిగిన క్రమాన్ని, ఆయన జీవితంలోని కొన్ని విషయాలను ఈ పాడ్‌కాస్ట్‌లో పంచుకున్నారు. ఈ రోజు నిఖిల్ కామత్ ‘పీపుల్’ సిరీస్‌లో మోడీ పాడ్‌కాస్ట్‌లో అరంగ్రేటం చేశారు.
ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ రియాక్ట్ అయ్యారు. మస్క్ లెఫ్ట్ వింగ్ కాకపోవడం వల్లే ఆ దేశాలన్నీ ఆయనపై మండిపడుతున్నాయన్నారు. పలు సందర్భాల్లో ఇటలీ, ఇతర దేశాధినేతలు తమ దేశ రాజకీయాల్లోనూ జోక్యం చేసుకున్నారని తెలిపింది.