ఇటలీ ప్రధాని జార్జియా మెలోని భారతీయ సంప్రదాయాన్ని అలవాటు చేసుకుంటున్నారు. సోమవారం అమెరికాలో మెలోని పర్యటించారు. జెలెన్‌స్కీకి మద్దతుగా యూరోపియన్ నేతలంతా తరలివచ్చారు. ఇక మెలోని వైట్‌హౌస్‌కు చేరుకున్నాక.. అమెరికా సిబ్బందిని ‘నమస్తే’ అంటూ పలకరించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నమస్తే అనే పలకరింపు భారతీయ సంప్రదాయం. దీంతో మెలోని.. ప్రధాని మోడీని అనుసరిస్తున్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Trump-Zelensky: వైట్‌హౌస్‌లో ట్రంప్-జెలెన్‌స్కీ నవ్వులు.. పువ్వులు.. వీడియో వైరల్
సోమవారం అమెరికా ప్రోటోకాల్ చీఫ్ మోనికా క్రౌలీని.. ఇటలీ ప్రధాని మెలోనికి స్వాగతం పలికారు. తొలుత షేక్‌హ్యాండ్ ఇచ్చి మాట్లాడారు. అనంతరం మెలోని రెండు చేతులు జోడించి నమస్తే అంటూ వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Modi-Putin: మోడీకి పుతిన్ ఫోన్ కాల్.. అలాస్కా వివరాలు వెల్లడి
ఇటలీలో జరిగిన G7 సమావేశంలో కూడా నాయకులను మెలోని ఇదే తరహాలో స్వాగతించారు. శిఖరాగ్ర సమావేశంలో మెలోనిని కూడా మోడీ అలానే పలకరించారు. అందుకు సంబంధించిన వీడియో అప్పుడు వైరల్ అయింది. ఇక దుబాయ్‌లో జరిగిన COP28 శిఖరాగ్ర సమావేశంలో కూడా మోడీ-మెలోని సెల్ఫీ కూడా వైరల్ అయింది. దీనిపై సోషల్ మీడియాలో అనేక కామెంట్లు కూడా వచ్చాయి. తాజాగా మరోసారి మెలోని పెట్టిన నమస్తే వైరల్ అవుతోంది.
Italian Prime Minister Giorgia Meloni (@GiorgiaMeloni) arrives at the White House 🇺🇸🇮🇹 pic.twitter.com/c1UrimWW7a
— Rapid Response 47 (@RapidResponse47) August 18, 2025
Il mio intervento nel corso del Vertice alla Casa Bianca. pic.twitter.com/Gj550OdwvJ
— Giorgia Meloni (@GiorgiaMeloni) August 18, 2025