ప్రధాని మోడీ పుట్టినరోజు సందర్భంగా దేశ, విదేశాల నుంచి రాజకీయ, సినీ ప్రముఖులంతా బర్త్‌డే విషెస్ చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.. ఇలా ఆయా దేశాలకు సంబంధించిన నాయకులంతా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.

ఇక ప్రధాని మోడీకి ఇటలీ ప్రధాని జార్జియా మెలోని స్పెషల్ గ్రీటింగ్ చెప్పారు. మోడీ నాయకత్వాన్ని ప్రశంసించారు. మీ బలం.. సంకల్పం.. లక్షలాది మందిని నడిపించే సామర్థ్యం స్ఫూర్తిదాయకం అని కొనియాడారు. ఈ మేరకు ఎక్స్‌లో మోడీతో ఉన్న ఫొటోను మెలోని పోస్ట్ చేశారు. భారతదేశాన్ని ఉజ్వల భవిష్యత్ వైపు నడిపించడానికి.. దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఆరోగ్యం, శక్తి కలగాలని కోరుకుంటున్నట్లు మెలోని రాశారు.
ఇది కూడా చదవండి: PM Modi: ఆపరేషన్ సిందూర్ ప్రతాపాన్ని జైషే కూడా అంగీకరించింది
ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒకరోజు ముందే.. మంగళవారమే మోడీకి ఫోన్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. దాదాపు 3 నెలల తర్వాత మోడీ-ట్రంప్ మాట్లాడుకోవడం ఇదే తొలిసారి. సుంకాల కారణంగా రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇన్నాళ్ల తర్వాత మోడీ-ట్రంప్ మాట్లాడుకోవడంతో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఇక మోడీ తనకు మంచి స్నేహితుడు అంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Dibang Project : చైనా వాటర్ బాంబ్‌పై భారత్ ఆటమ్ బాంబ్!
ఇక ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా వీడియోలో మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. భారతదేశం కోసం చాలా సాధించారంటూ నెతన్యాహు కొనియాడారు. భారతదేశం-ఇజ్రాయెల్ మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయన్నారు. రెండు దేశాలు మంచి విజయాలను సాధించాయని నెతన్యాహు ప్రశ్నించారు.
అలాగే ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ కూడా మోడీకి బర్త్‌డే విషెస్ చెప్పారు. రెండు దేశాల మధ్య మంచి భాగస్వామ్యం ఉందని ప్రశంసించారు. అలాగే మోడీ మంచి స్నేహితుడు అంటూ తెలిపారు. భారతదేశంతో ఇంత బలమైన స్నేహాన్ని పంచుకోవడానికి ఆస్ట్రేలియా స్వాగతిస్తుందన్నారు. ఇక ఆస్ట్రేలియాలో భారతదేశ సమాజం అందిస్తున్న అద్భుతమైన సహకారానికి ప్రతిరోజూ కృతజ్ఞతలమై ఉన్నట్లు చెప్పారు.
న్యూజిలాండ్ ప్రధాన మంత్రి క్రిస్టోఫర్ లక్సన్ కూడా మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే యూకే మాజీ ప్రధాని రిషి సునక్ కూడా విషెస్ చెప్పారు. బ్రిటన్‌కు మోడీ మంచి స్నేహితుడు అని కొనియాడారు. రెండు దేశాల మధ్య మంచి సంబంధాలు ఉన్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు.
Buon 75° compleanno al Primo Ministro indiano @narendramodi.
La sua forza, la sua determinazione e la sua capacità di guidare milioni di persone sono fonte di ispirazione.
Con amicizia e stima gli auguro salute ed energia per continuare a guidare l’India verso un futuro luminoso… pic.twitter.com/OqXr1GFlc0— Giorgia Meloni (@GiorgiaMeloni) September 17, 2025