ఉమ్మడి ప్రకాశం జిల్లా గిద్దలూరు, కందుకూరు టీడీపీలో అసమ్మతి కొనసాగుతుంది. ఆ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు టీడీపీ రెబల్స్ రెడీ అవుతున్నారు. గిద్దలూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్దిగా ముత్తుముల అశోక్ రెడ్డిని తెలుగు దేశం పార్టీ అధిష్టానం ప్రకటించింది.
ఇవాళ ప్రకాశం జిల్లాలోని అర్ధవీడు మండలంలోని 25 కోట్ల రూపాయలతో నిర్మించనున్న రంగాపురం- అర్ధవీడు రోడ్డు నిర్మాణానికి గిద్దలూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి శంకుస్థాపన చేశారు.
మాజీ ఎమ్మెల్యే పగడాల రామయ్య ఆశయాలను కొనసాగించాలని మార్కాపురం ఎమ్మెల్యే, గిద్దలూరు నియోజకవర్గ ఇంఛార్జ్ కుందురు నాగార్జునరెడ్డి పేర్కొన్నారు. పగడాల రామయ్య 6వ వర్ధంతి రాచర్ల మండలం చినగానిపల్లె గ్రామంలోని ఆయన నివాసంలో సోమవారం నాడు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గిద్దలూరు వైసీపీ ఇంచార్జ్ కుందూరు నాగార్జునరెడ్డి హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
రానున్న ఎన్నికల్లో అనారోగ్య కారణాలతో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు ఎమ్మెల్యే అన్నా రాంబాబు.. మరోవైపు, పలువురు పార్టీ నియోజకవర్గ నేతలు తనను ఇబ్బందిపెట్టేలా వ్యవహరించినా పార్టీ పెద్దలు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒంగోలు ఎంపీ మాగుంటపై తీవ్ర విమర్శలు చేశారు అన్నా రాంబాబు
ప్రకాశం జిల్లా గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు…పులివెందులలో జగన్ తర్వాత భారీ మెజార్టీతో గెలిచారు. మొదట్లో అంతా బాగానే ఉన్నా.. కొన్నాళ్లకు నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి నేతలతో పేచీలు వచ్చాయి.. దీంతో ఆ నియోజక వర్గంలో ఎమ్మెల్యే అన్నా అనుకూల, వ్యతిరేక గ్రూపులుగా వైసీపీ కేడర్ విడిపోయింది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కూడా గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అన్నా రాంబాబు…ముందుగా ప్రారంభించలేకపోయారు. అధిష్టానం జోక్యంతో ఎట్టకేలకు ప్రారంభించారు. మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న…
కొన్ని సార్లు ఊహించని పరిణామాలు కొందరికి షాక్ ఇస్తాయి.. వాటి నుంచి తేరుకోవడం కూడా కష్టమే.. ఇక, ఒక మనిషి జీవితంలో పుట్టుక, చావు రెండే కీలకమైనవి.. మధ్యలో బాగోతం అంతా కొన్నినాళ్లే.. అయితే, ఓ వ్యక్తి 40 రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు.. ఇటీవల ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.. ఆ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు.. తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.. కర్మకాండలు నిర్వహించి బంధువులకు భోజనాలు పెడుతున్న…
ప్రకాశం జిల్లా గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, 2009 ముందు వరకూ సివిల్ కాంట్రాక్టరుగా ఉన్న అన్నా రాంబాబు, ప్రజారాజ్యం పార్టీలో చేరి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావటంతో, కాంగ్రెస్ లో కొన్నాళ్లు కొనసాగారు. ఆ తర్వాత కాంగ్రెస్ ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరి, 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత అనూహ్య పరిణామాలతో, బహిరంగంగా ఆ పార్టీ కండువాను తీసి…