మాజీ ఎమ్మెల్యే పగడాల రామయ్య ఆశయాలను కొనసాగించాలని మార్కాపురం ఎమ్మెల్యే, గిద్దలూరు నియోజకవర్గ ఇంఛార్జ్ కుందురు నాగార్జునరెడ్డి పేర్కొన్నారు. పగడాల రామయ్య 6వ వర్ధంతి రాచర్ల మండలం చినగానిపల్లె గ్రామంలోని ఆయన నివాసంలో సోమవారం నాడు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గిద్దలూరు వైసీపీ ఇంచార్జ్ కుందూరు నాగార్జునరెడ్డి హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి మాట్లాడుతూ.. పగడాల రామయ్య తన తండ్రితో కలిసి చేసిన మంచి పనులను, అభివృద్ధి పనులను ఆయన గుర్తు చేసుకున్నారు. పగడాల ఆశయాలను కొనసాగించేందుకు, గిద్దలూరు అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానను చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో నాగార్జునరెడ్డితో పాటు జడ్పీటీసీ పగడాల రమాదేవి, పగడాల శ్రీరంగం, పగడాల కృష్ణ, రాచర్ల మాజీ జడ్పీటీసీ రంగసాయి, సీఆర్ఐ మురళీ, ఆర్డీ రామకృష్ణ, ముదర్ల శ్రీను, సూర పాండు రంగారెడ్డి, తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.