Kishan Reddy : తెలంగాణ రాష్ట్రాన్ని భూములు, మద్యం అమ్మకాలతో నడిపించాలనే తపనతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, “ఇంట్లో చెట్టు కాటానికే జీహెచ్ఎంసీ అనుమతి అవసరం అయితే, హెచ్‌సీయూలో ఉన్న చెట్లను ఎవరి అనుమతితో నరికి వేశారు?” అంటూ ప్రశ్నించారు. కన్జర్వేషన్ యాక్ట్ ఉల్లంఘించారని ఆరోపిస్తూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూముల అమ్మకాలే…
ఉపరితల ఆవర్తన ప్రభావంతో హైదరాబాద్ లో ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టాలని హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. జీహెచ్ ఎంసీ పరిధిలోని ఆరు జోన్లలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఎర్రమంజిల్ ప్రాంతంలో చెట్టు కూలడంతో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ ఐఆర్టి టీమ్స్ వాటిని క్లియర్ చేసింది. సెక్రటేరియట్, రాజ్ భవన్ రోడ్, మసబ్ ట్యాంక్ పరిసర ప్రాంతాలతో…
మూసీ పరిసరాల్లో నిర్మాణాలను నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. పురపాలక శాఖ తాజా ఉత్తర్వుల ప్రకారం.. మూసీ నది పరిసరాల్లో నిర్మాణ అనుమతులపై కఠిన నియంత్రణలు అమలు చేయనుంది. ఇందుకు సంబంధించి నాలుగు మంది సీనియర్ అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. మూసీకి 50 మీటర్ల పరిధిలో బఫర్ జోన్ కల్పించి, ఆ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని స్పష్టం చేసింది. అలాగే, 50 నుంచి 100 మీటర్ల మధ్య ప్రాంతంలో కొత్తగా…
అది ‘‘వక్ఫ్ బిల్లు’’ కాదు, ‘‘వక్ఫ్ విధ్వంస బిల్లు’’.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘‘వక్ఫ్ సవరణ బిల్లు’’ బుధవారం పార్లమెంట్ ముందుకు రాబోతోంది. రేపు మధ్యాహ్నం బిల్లును ముందుగా లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే, ఎంపీలు అంతా సభకు హాజరుకావాలని ఎన్డీయే పార్టీలు తమ తమ సభ్యులకు సమాచారం ఇచ్చింది. మరోవైపు, ఈ బిల్లును అడ్డుకునే దిశగా కాంగ్రెస్, టీఎంసీ, ఎస్పీ వంటి ఇండీ కూటమి నేతలు వ్యూహాలు రూపొందిస్తున్నారు.…
GHMC : 2024-25 ఆర్థిక సంవత్సరంలో, జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో రికార్డు స్థాయిలో ఆస్తి పన్ను వసూలు అయ్యింది. ఈ ఏడాది 2,038 కోట్లు, 48 లక్షల రూపాయలు ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేయడం జరిగింది. ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 121 కోట్లు ఎక్కువ. గత ఆర్థిక సంవత్సరంలో 1,917 కోట్లు ఆస్తి పన్ను వసూలు చేయబడింది. ఈ సంవత్సరంలో 19 లక్షల 50 వేల ఆస్తులున్నా, 14 లక్షల 8 వేల మంది…
ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపునకు గడువు ఈరోజుతో ముగియనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు జీహెచ్ఎంసీ రూ.1,910 కోట్లు వసూలు చేసింది. 2023-24 సంవత్సరానికి మొత్తం రూ.1,917 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ వసూలైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది రూ.2,000 కోట్ల వసూలు లక్ష్యంగా జీహెచ్ఎంసీ పని చేస్తోంది.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్ పోటీ చేయడం లేదా? ఎందుకొచ్చిన రిస్క్ అనుకుంటోందా? అధికారంలో ఉండి కూడా రిస్క్ అనుకోవడం వెనక రీజనేంటి? ఏ విషయంలో హస్తం పార్టీ వెనక్కి తగ్గుతోంది? ఎక్కడ జరగబోతోందా ఎన్నిక? తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల టైం దగ్గర పడుతోంది. ఏప్రిల్ 4 తో నామినేషన్ గడువు ముగుస్తుంది. ప్రత్యేకించి ఇది జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్సీ సీటు కావడంతో… అన్ని వర్గాల్లో ఉత్కంఠ పెరుగుతోంది. బరిలో నిలిచేది ఎవరు……
Hyderabad: హైదరాబాద్ నగరంలోని డబీర్‌పురలో మాతాకీ కిడ్కి ప్రాంతంలో కమిషనర్ టాస్క్ ఫోర్స్, జీహెచ్ఎంసీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో, అక్రమంగా పాడైన మేక, గొర్రె మాంసాన్ని ఫ్రిడ్జ్‌లో నిల్వ చేసి వాటిని వివిధ వివాహాలు, హోటల్స్‌కి సరఫరా చేస్తున్న మహమ్మద్ మిస్బాహుద్దీన్ అనే 24 ఏళ్ల వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మహమ్మద్ మిస్బాహుద్దీన్ తన వద్ద 2 క్వింటాళ్ల పాడైన మేక, గొర్రె మాంసాన్ని ఫ్రిజ్‌లలో నిల్వ చేసి వాటిని తక్కువ…
గ్రేటర్ వాసులకు ఏ సమస్యనైనా అధికారుల దృష్టికి వెంటనే తీసుకెళ్లే సరికొత్త యాప్ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ యాప్ పేరే మై జీహెచ్ఎంసీ. ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. రహదారులపై గుంతలు, చెత్త, మురుగు నీటి వ్యవస్థ బాగోలేకపోయినా... ఇలా ఏ సమస్య అయినా ఒక ఫోటో తీసి యాప్ లో అప్ లోడ్ చేస్తే చాలు... ఏ ప్రాంతం నుంచి ఫోటో అప్ లోడ్ అయితే ఆ ప్రాంత అధికారులకు…
హైదరాబాద్ లో రేపు(మార్చి 20) మధ్యాహ్నం జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం జరుగనుంది. జీహెచ్ఎంసీ మేయర్, కమీషనర్ అధ్యక్షతన స్టాండింగ్ కమిటీ సమావేశం జరగనున్నది. కొత్తగా ఎన్నికైన స్టాండింగ్ కమిటీ సభ్యులతో మొదటి సమావేశం నిర్వహించనున్నారు. ఈసారి స్టాండింగ్ కమిటీలో ఎనిమిది మంది MIM, ఏడుగురు కాంగ్రెస్ కార్పొరేటర్లు ఉన్నారు. స్టాండింగ్ కమిటీలో ప్రాతినిధ్యం లేని బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు. Also Read:Hyderabad: పసి పిల్లలను అమ్ముతున్నారు జాగ్రత్త.. ముఠాను అరెస్టు చేసిన రాచకొండ పోలీసులు.. ఈ…