నేడు హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.. ఉదయం 8 గంటలకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కౌంటింగ్ ప్రారంభమవుతుంది.. ఇప్పటికే కౌంటింగ్ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి.. మరో రెండు, మూడు గంటల్లో ఉత్కంఠకు తెరపడనుంది.. మొన్న జరిగిన ఎన్నికల్లో 78.57 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 112 ఓట్లకు గాను 88 ఓట్లు పోలయ్యాయి. 66 కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్ ఆఫీషియో సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు..
READ MORE: Ceasefire: సంచలన నిర్ణయం దిశగా భారత్.. పాక్‌తో ‘‘కాల్పుల విరమణ’’ రద్దు..
బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల కార్పొరేటర్లు, ఎక్స్ ఆఫీషియో సభ్యులు పోలింగ్ లో పాల్గొన్నారు.. బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.. ఎంఐఎం, బీజేపీ పోటాపోటీగా బరిలోకి దిగాయి.. ఎంఐఎం నుంచి మీర్జా రీయాజ్ ఉల్ హాసన్ ఎఫెండీ, బీజేపీ నుంచి గౌతమ్ రావు పోటీ చేశారు.. ఎంఐఎం పార్టీ గెలుపుపై ధీమాగా ఉంది. క్రాస్ ఓటింగ్ పై బీజేపీ ఆశలు పెట్టుకుంది.
READ MORE: Indian Airlines: ‘‘పాకిస్తాన్ ఎయిర్‌స్పేస్ మూసివేత’’.. భారతీయ విమానాలపై అదనపు భారం..