అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. అమరావతి చుట్టుపక్కల 5 జిల్లాల్లో ఓఆర్ఆర్‌ను నిర్మించనున్నారు. దీని మొత్తం పొడవు 189.9 కిలోమీటర్లు ఉండనుంది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ఎలైన్‌మెంట్ అప్రూవల్ కమిటీ ఆమోదం తెలిపింది. విజయవాడ తూర్పు బైపాస్ అవసరం లేదని తేల్చేసింది. దానికి ప్రత్యామ్నాయంగా రెండు లింక్ రోడ్ల నిర్మాణానికి అవకాశం కల్పించింది.
మంగళవారం నాడు తెలంగాణ రాష్టంలోని వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియలోని భాగంగా మార్క్ ను టీఎస్ నుంచి టీజీ కి మారుస్తూ కేంద్ర రహదారి రవాణా శాఖ గెజిట్ నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఇందుకుగాను 1988లోని సెక్షన్ 41(6) మోటారు వాహనాల చట్టం కింద ఉన్న అధికారాలను వాడుకొని 1989 జూన్ 12 నాటికి అప్పటి రవాణా శాఖ జారీ చేయబడిన గెజిట్ నోటిఫికేషన్ లో ఈ మార్పులు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.
R 5 zone: రాజధానిలో ఆర్-5 జోన్ విషయంలో ముందడుగు వేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఆర్-5 జోన్ ఏర్పాటు చేస్తూ గెజిట్ జారీ చేసింది సర్కార్.. 900 ఎకరాల భూముల్ని ఆర్-5 జోన్ పరిధిలోకి తెచ్చారు.. అమరావతిలో స్థానికేతరులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేసన్ విడుదల చేసింది. విజయవాడ, గుంటూరు నగరాలకు చెందిన పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రత్యేక జోన్ ఏర్పాటు చేసింది. ఆ ఎంపిక చేసిన భూముల ప్రాంతాన్ని ఆర్-5…
సరిహద్దు భద్రతాదళం అధికారాలను పెంచుతూ కేంద్రహోంశాఖ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. బంగ్లాదేశ్, పాకిస్థాన్ తో అంతర్జాతీయ సరిహద్దుల నుంచి మూడు రాష్ట్రాల్లో 50 కిలోమీటర్లు లోపలి వరకు తనిఖీలు, అరెస్టులు, నిర్బంధం చేసే అధికారాలను బీఎస్‌ఎఫ్‌కు ఇస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ సరిహద్దుల నుంచి 15 కిలోమీటర్ల వరకు మాత్రమే బీఎస్‌ఎఫ్‌కు తనిఖీలు, అరెస్టులు చేసే అధికారముంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం సమాఖ్య స్పూర్తికి విరుద్ధం అంటూ పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్…
తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడానికి తెరదింపాలని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించేలా కనిపించడంలేదు.. కేంద్రం నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించే పరిస్థితి కనిపించడంలేదు.. ఇవాళ్టి నుంచి గెజిట్ అమల్లోకి రావాల్సి ఉండగా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు పోటాపోటీగా ఆసల్యం చేసేపనిలో పడిపోయాయి.. ప్రాజెక్టుల అప్పగింతపై తెలంగాణ ప్రభుత్వం కమిటీ వేసింది.. దీంతో ఆంధ్రప్రదేశ్ సర్కార్ కూడా పునరాలోచనలో పడిపోయింది. విద్యుత్ కేంద్రాలు, ఆఫ్ టేక్ ప్రాజెక్టులను తెలంగాణ అప్పగిస్తేనే.. ప్రాజెక్టుల అప్పగింత ప్రక్రియ మొదలుపెట్టాలని…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కొనసాగుతోన్న జలజగడానికి తెరదించాలన్న ఉద్దేశంతో.. కేంద్ర ప్రభుత్వం కృష్ణా, గోదావరి జలాల విషయంలో గెజిట్ విడుదల చేసింది.. దీనిపై అభ్యంతరాలు ఓవైపు.. ఆహ్వానించడాలు మరోవైపు జరుగుతున్నాయి.. అయితే, కేంద్ర ప్రభుత్వం జలాల విషయంలో చేసిన గెజిట్ శుభపరిణామం అంటున్నారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి… తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ ప్రజలందరికీ ఉపయోగపడుతుందన్నారు.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి…